Ganesh Nimajjanam: 28న ఉదయం 6 గంటల నుంచి ఖైరతాబాద్‌ గణేశుడి శోభాయాత్ర

గురువారం ఖైరతాబాద్‌ గణేశుడి నిమజ్జనం నేపథ్యంలో భక్తులు భారీ సంఖ్యలో అక్కడికి చేరుకుని దర్శించుకుంటున్నారు. ఈ అర్ధరాత్రి లంబోదరుడికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.

Updated : 27 Sep 2023 14:22 IST

హైదరాబాద్: గురువారం ఖైరతాబాద్‌ గణేశుడి నిమజ్జనం నేపథ్యంలో భక్తులు భారీ సంఖ్యలో అక్కడికి చేరుకుని దర్శించుకుంటున్నారు. ఈ అర్ధరాత్రి లంబోదరుడికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. 28న ఉదయం 6 గంటలకు ఖైరతాబాద్‌ గణేశుడి శోభాయత్ర ప్రారంభంకానుంది. గురువారం మధ్యాహ్నం 12 నుంచి 2 గంటల మధ్య నిమజ్జనం చేయనున్నట్లు భాగ్యనగర్‌ గణేష్‌ ఉత్సవ సమితి వెల్లడించింది. 

మీలో మార్పు కోరుకుంటూ వెళ్లొస్తా..!

గణేశ్‌ నిమజ్జనం, మిలాద్‌ ఉన్‌ నబీ 35 ఏళ్ల తర్వాత ఈసారి ఒకే రోజు వస్తున్నాయి. దీంతో గణేశ్‌ ఊరేగింపు, నిమజ్జనం కోసం రాజధాని నగరంలో రికార్డు స్థాయిలో దాదాపు 40 వేల మంది పోలీసుల్ని బందోబస్తు కోసం వినియోగిస్తున్నారు. హుస్సేన్‌సాగర్‌ చుట్టూ 5 చోట్ల 36 క్రేన్లు, పదుల కొద్దీ జేసీబీలు, టిప్పర్లు, వేలాది మంది సిబ్బందితో నిమజ్జన ప్రదేశాలు సిద్ధమయ్యాయి. దాదాపు 48 గంటలపాటు సాగే ఊరేగింపు, నిమజ్జనంలో 20 వేలకుపైగా సీసీ కెమెరాలతో పర్యవేక్షించనున్నారు.

మరోవైపు బాలాపూర్ గణేష్ శోభాయాత్రకు పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పాతబస్తీలోని చాంద్రాయణ గుట్ట, చార్మినార్, అఫ్జల్‌గంజ్‌, ఎంజే మార్కెట్, అబిడ్స్, హుస్సేన్ సాగర్ మీదుగా దాదాపు 19 కిలో మీటర్ల మేర బాలాపూర్ గణేశుడి శోభాయాత్ర సాగనుంది. బంజారాహిల్స్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌ నుంచి సీపీ సీవీ ఆనంద్, ఇతర ఉన్నతాధికారులు నిమజ్జనాన్ని పర్యవేక్షించనున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని