Ganesh Nimajjanam: గంగమ్మ ఒడికి ఖైరతాబాద్‌ గణేశుడు.. ఘనంగా నిమజ్జనోత్సవం

ఈ ఏడాది దశ మహా విద్యా గణపతిగా భక్తకోటికి దర్శనమిచ్చిన.. ఖైరతాబాద్‌ మహాగణపతి గంగమ్మ ఒడికి చేరాడు.

Updated : 28 Sep 2023 14:11 IST

ఖైరతాబాద్‌ గణేశుడి శోభాయాత్ర.. ఫొటో గ్యాలరీ

హైదరాబాద్‌: ఈ ఏడాది దశ మహా విద్యా గణపతిగా భక్తకోటికి దర్శనమిచ్చిన.. ఖైరతాబాద్‌ మహాగణపతి గంగమ్మ ఒడికి చేరాడు. భక్తజన కోలాహలం మధ్య శోభాయాత్రగా హుస్సేన్‌సాగర్‌కు తరలివచ్చిన విఘ్నేశ్వరుడి నిమజ్జనం పూర్తయింది. ట్యాంక్‌బండ్‌పై ఎన్టీఆర్‌ మార్గ్‌ వద్ద ఏర్పాటు చేసిన నాలుగో నంబర్‌ క్రేన్‌ వద్ద బడా గణేశుడిని గంగమ్మ ఒడికి నిర్వాహకులు చేర్చారు. ఉదయం 6 గంటలకు మొదలైన గణేశ్‌ శోభాయాత్ర.. భక్తుల కోలాహలం మధ్య సందడిగా కొనసాగింది.

మరోవైపు బాలాపూర్‌ గణపతి శోభాయాత్ర కూడా హుస్సేన్‌సాగర్‌ వైపు కొనసాగుతోంది. హైదరాబాద్‌ వ్యాప్తంగా వస్తున్న బొజ్జ గణపయ్యల విగ్రహాలతో ట్యాంక్‌బండ్‌, నెక్లెస్‌రోడ్డు సందడిగా మారాయి. నిమజ్జనాన్ని తిలకించేందుకు భారీ సంఖ్యలో భక్తుల తరలివస్తున్నారు. ‘గణపతి బప్పా మోరియా’, ‘జై బోలో గణేశ్‌ మహరాజ్‌’ నినాదాలతో ట్యాంక్‌బండ్‌ పరిసరాలు మార్మోగుతున్నాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని