పార్టీలో చేరేందుకు సిద్ధమై.. పోలీసులను చూసి పారిపోయి..

ఆ రౌడీషీటర్‌ ఓ ప్రముఖ పార్టీలో చేరేందుకు అన్ని ఏర్పాట్లు..

Updated : 01 Sep 2020 16:54 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఆ రౌడీషీటర్‌ ఓ ప్రముఖ పార్టీలో చేరేందుకు అన్ని ఏర్పాట్లు జరిగాయి. అందుకు తేదీ ఖరారు చేసుకొని సభను కూడా ఏర్పాటు చేసుకున్నారు. అతిథులందరూ హాజరయ్యారు. పార్టీలో చేరేందుకు అతడి అనుచరులు కూడా వచ్చారు. అయితే సభ వద్ద పోలీసులు ప్రత్యక్షమవడంతో అక్కడి నుంచి ఉడాయించాడు. ఈ ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. రౌడీషీటర్‌ సూర్యపై పలు క్రిమినల్‌ కేసులు ఉన్నాయి. కాగా అతడు భాజపాలో చేరాలని నిశ్చయించుకున్నాడు. తమిళనాడు పార్టీ అధ్యక్షుడు ఎల్‌ మురుగన్‌ సమక్షంలో పార్టీలో చేరేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకొని అనుచరులతో సహా సభ వద్దకు వచ్చాడు. సమాచారం అందుకున్న చెంగల్పట్టు పోలీసులు ఆ సభను చుట్టుముట్టారు. విషయాన్ని పసిగట్టిన రౌడీషీటర్‌ చాకచక్యంగా అక్కడినుంచి కారులో ఉడాయించాడు. పారిపోయేందుకు ప్రయత్నిస్తున్న నలుగురు అనుచరులను అరెస్టు చేశారు. అనంతరం వారు బెయిల్‌ మీద విడుదలయ్యారు.

కాగా ఈ విషయంపై పార్టీ అధ్యక్షుడు మురుగన్‌ పోలీసులను ఆరా తీయడంతో వారు పలు విషయాలు వెల్లడించారు. సూర్యపై 35కు పైగా క్రిమినల్‌ కేసులు ఉన్నాయని, అందులో 6 హత్య కేసులు అని పేర్కొన్నారు. పోలీసులకు దొరకకుండా తప్పించుకొని తిరుగుతున్నాడని తెలిపారు. అయితే పార్టీలో చేరేవారి వివరాలు తనకు తెలియవని మురుగన్‌ ఈసందర్భంగా పేర్కొన్నారు.
 

Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు