Updated : 04 Jul 2022 15:57 IST

Andhra News: మోదీ పర్యటనలో నల్ల బెలూన్లతో నిరసన.. పలువురి అరెస్టు

గన్నవరం: ఆంధ్రప్రదేశ్‌లో ప్రధాని నరేంద్రమోదీ పర్యటన నేపథ్యంలో గన్నవరం విమానాశ్రయం పరిసరాల్లో నల్ల బెలూన్లను ఎగరవేయడంపై పోలీసులు విచారణను వేగవంతం చేశారు. మోదీ గన్నవరం విమానాశ్రయం చేరుకున్న సమయంలో నల్ల బెలూన్లను ఎగరవేయడంపై గన్నవరం పోలీసులు కేసు నమోదు చేశారు. డీఎస్పీ విజయ్‌పాల్‌ నేతృత్వంలో విచారణ ప్రారంభించారు. గన్నవరం పోలీసు స్టేషన్‌లో పలువురు పోలీసు అధికారులతో డీఎస్పీ సమీక్షించారు. నల్ల బెలూన్లను ఎగరవేయడాన్ని ఎస్పీ జాషువా తీవ్రంగా పరిగణించినట్లు డీఎస్పీ తెలిపారు. ఈ ఘటనలో ఐదుగురు పాల్గొన్నట్టు పోలీసులు ప్రాథమికంగా తేల్చారు. పీసీసీ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌ రతన్‌ ఎగరవేసినట్టుగా గుర్తించారు. ప్రస్తుతం పరారీలో ఉన్న రాజీవ్‌ కోసం పోలీసులు గాలిస్తున్నారు. బెలూన్లను ఎగరవేసిన వారిలో కాంగ్రెస్‌ నేత సుంకర పద్మశ్రీతో పాటు మరికొంత మంది మహిళలను పోలీసులు అదపులోకి తీసుకున్నట్లు సమాచారం.


Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని