TTD: కన్నుల పండువగా శ్రీవారి గరుడ వాహన సేవ

కలియుగ ప్రత్యక్షదైవం శ్రీనివాసుడు వెలసిన తిరుమలలో బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈ రోజు స్వామివారు

Updated : 11 Oct 2021 22:12 IST

తిరుమల: కలియుగ ప్రత్యక్షదైవం శ్రీనివాసుడు వెలసిన తిరుమలలో బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈ రోజు స్వామివారు తన ప్రియ వాహనమైన గరుడ వాహనంపై ఆసీనులై భక్తులను ఆశీర్వదించారు. కొవిడ్‌ కారణంగా ఆలయంలోనే ఉత్సవాలు నిర్వహిస్తున్నప్పటికీ కోట్లాది మంది భక్తులు స్వామివారిని ప్రత్యక్ష ప్రసారంలో వీక్షించి భక్తి సాగరంలో పులకించారు. గరుత్మంతుడు తన మాతృమూర్తిని దాస్యం నుంచి విముక్తి చేసిన వీరపుత్రుడు. జన్మనిచ్చిన తల్లి సేవ కోసం నిరంతరం శ్రమించిన గరుత్ముంతుడిని శ్రీమహావిష్ణువు తన అనుంగు వాహనంగా చేసుకున్నారు. అందుకే బ్రహ్మోత్సవాల్లో గరుడసేవ వీక్షణం అత్యంత పవిత్రమని పురాణాలు చెబుతున్నాయి. అంతకముందు గరుడ సమేతుడైన మలయప్ప స్వామిని  సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి దర్శించుకున్నారు. సంప్రదాయంలో భాగంగా ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలను స్వామివారికి సమర్పించారు.

2022 క్యాలెండర్‌, డైరీ ఆవిష్కరించిన సీఎం

సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి తితిదే 2022 క్యాలెండర్‌, డైరీని ఆవిష్కరించారు. తొలుత తిరుమల చేరుకున్న సీఎంకు రంగనాయక మండపంలో వేద పండితులు ఆశీర్వచనాలు అందజేశారు. అనంతరం తితిదే ఛైర్మన్‌, ఈవోలు స్వామివారి తీర్థప్రసాదాలు, శ్రీవారి చిత్రపటం బహూకరించారు. శ్రీవారి గరుడ వాహన సేవలో పాల్గొన్న సీఎం.. అనంతరం పద్మావతి వసతిగృహానికి చేరుకున్నారు. ఈ రాత్రికి ఆయన తిరుమలలోనే బస చేయనున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు