Gastritis: వానాకాలంలో వచ్చే ముప్పు ఏంటో తెలుసా..?

వానాకాలం ఎంత మురిపెంగా ఉంటుందో.. అంతే ముప్పును తెచ్చిపెడుతుంది. దీన్ని వ్యాధుల కాలంగా కూడా చెప్పొచ్చు. చెత్తాచెదారంతో ఉండే పరిసరాలు సూక్ష్మక్రిములతో నిండిపోతాయి. తాగే నీటితో పాటు తినే ఆహార పదార్థాలు తొందరగా కలుషితం అవుతాయి.

Published : 14 Aug 2022 02:12 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: వానాకాలం ఎంత మురిపెంగా ఉంటుందో.. అంతే ముప్పును తెచ్చిపెడుతుంది. దీన్ని వ్యాధుల కాలంగా కూడా చెప్పొచ్చు. చెత్తాచెదారంతో ఉండే పరిసరాలు సూక్ష్మక్రిములతో నిండిపోతాయి. తాగే నీటితో పాటు తినే ఆహార పదార్థాలు తొందరగా కలుషితం అవుతాయి. వాంతులు, విరేచనాలే కాదు..కలుషిత ఆహారంతో గ్యాస్ట్రైటీస్‌ బారిన చాలా మంది పడుతారు. ఇది దీర్ఘకాలికంగా ఉంటే అల్సర్ల సమస్య వస్తుందని వైద్యులు చెబుతున్నారు. ఈ గ్యాస్ట్రైటీస్‌ బాధ గురించి గ్యాస్ట్రో ఎంటరాలజిస్టు డాక్టర్‌ పులి చంద్రశేఖర్‌ వెల్లడించారు.

జీర్ణ వ్యవస్థపై ప్రభావం

కలుషిత నీరు, ఆహారంతో జీర్ణ వ్యవస్థ దెబ్బతింటుంది. ఈ సమస్యను గ్యాస్ట్రైటీస్‌గా పేర్కొంటున్నాం. నీరు ఎక్కడ కలుషితం అవుతుందో అంతుచిక్కదు. కలుషిత వాతావరణంతో ఎక్కువగా చిన్న పిల్లలకు సమస్యగా మారుతుంది. పొట్టలోని మ్యూకస్‌ పొరకు వాపు వస్తుంది. కడుపులో నొప్పి, మంట, కడుపు ఉబ్బరం, కొంచెం తిన్నా అరగకపోవడం, అజీర్ణం, రక్తంతో కూడిన వాంతులు కావడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. ఎప్పుడూ వాంతులు అవుతున్నట్టు అనిపిస్తుంది. జ్వరం కూడా వస్తుంది. 

జాగ్రత్త పడితే మేలు

ఆహారం తిన్నా, మంచినీరు తాగినా తొందరగా వాంతులు, విరేచనాలు అవుతుంటాయి. మధుమేహంతో బాధ పడుతున్న వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. వేడి చేసుకొని చల్లార్చిన నీటిని వాడుకోవాలి.  రెండు, మూడుసార్లు విరేచనాలయితే వైద్యుల దగ్గరకు వెళ్లాలి. పాత్రలను వేడి నీటితో శుభ్రం చేసుకోవాలి. పండ్ల రసాలు, కొబ్బరినీటిని తాగాలి. తొందరగా జీర్ణం అయ్యే పండ్లను తీసుకోవాలి. వ్యక్తిగత శుభ్రత చాలా అవసరం. బయటి ఆహారం తీసుకోకపోవడం చాలా మంచిది.


Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని