APPSC: త్వరలో గ్రూప్ -1, గ్రూప్-2 నోటిఫికేషన్లు: గౌతమ్ సవాంగ్
త్వరలోనే గ్రూప్-1, గ్రూప్-2 పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్లు విడుదల చేస్తామని ఏపీపీఎస్సీ ఛైర్మన్ గౌతమ్ సవాంగ్ తెలిపారు.

విజయవాడ: త్వరలోనే గ్రూప్-1, గ్రూప్-2 పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్లు విడుదల చేస్తామని ఏపీపీఎస్సీ ఛైర్మన్ గౌతమ్ సవాంగ్ తెలిపారు. విజయవాడలో మీడియాతో ఆయన మాట్లాడారు. గతేడాది సెప్టెంబర్‌లో విడుదలైన గ్రూప్-1 నోటిఫికేషన్‌కు సంబంధించిన మెయిన్స్ పరీక్షలను జూన్ 3 నుంచి 10 వరకు గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు నిర్వహించనున్నట్లు సవాంగ్ తెలిపారు.
ఈ ఏడాది జనవరి 8న ప్రిలిమ్స్ పరీక్షలు నిర్వహించామని సవాంగ్ చెప్పారు. పరీక్షలు జరిగిన 19 రోజుల్లోనే ఫలితాలు ప్రకటించామని.. 6,455 మంది మెయిన్స్‌కు అర్హత సాధించారన్నారు. జూన్ 3 నుంచి మెయిన్స్ పరీక్షలను 10 జిల్లాల్లోని 11 కేంద్రాల్లో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశామని చెప్పారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంటల వరకు ఈ పరీక్షలు జరుగుతాయని చెప్పారు. ఉదయం 8.30 గంటల నుంచి 9.30 వరకు పరీక్షా కేంద్రంలోకి అనుమతిస్తామన్నారు. కేవలం 15 నిమిషాలు మాత్రమే గ్రేస్ పిరియడ్ ఉంటుందని.. ఆ సమయం దాటితే లోనికి అనుమతించబోమని స్పష్టం చేశారు. జులైలో మెయిన్స్ ఫలితాలు వెల్లడించి ఆగస్టు చివరి నాటికి గ్రూప్-1 ఇంటర్వ్యూలు పూర్తిచేస్తామని గౌతమ్ సవాంగ్ తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Asia cup: జావెలిన్ త్రోయర్ కిశోర్ జెనాకు ఒడిశా బంపర్ ఆఫర్!
-
Pakistan: అఫ్గాన్ సైనికుడి కాల్పులు.. ఇద్దరు పాక్ పౌరులు మృతి
-
Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (05/10/2023)
-
Intresting News today: ఈరోజు ఆసక్తికర వార్తలు మిస్సయ్యారా?.. అయితే ఇవి మీకోసమే..
-
Vande Bharat: కాషాయ రంగులో ‘వందేభారత్’.. రైల్వే మంత్రి వివరణ ఇదే!
-
సల్మాన్ సినిమా ఫ్లాప్.. నన్ను చచ్చిపోమన్నారు: హీరోయిన్