Andhra news: ఏపీలో వచ్చే ఏడాది 23 సాధారణ సెలవులు.. జాబితా ఇదే!

2023 ఏడాదికిగానూ సాధారణ సెలవులపై ఏపీ ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీ  చేసింది. భోగి, సంక్రాంతి, కనుమ పండగలను సాధారణ సెలవుల జాబితాలో చేర్చింది.

Published : 16 Dec 2022 01:47 IST

అమరావతి: ఏపీలో వచ్చే ఏడాది(2023)లో సాధారణ సెలవులపై రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పండుగలు, జాతీయ సెలవులను కలిపి ప్రభుత్వ కార్యాలయాలకు మొత్తం 23 రోజులను సాధారణ సెలవులుగా ప్రకటించింది. ఈమేరకు నోటిఫికేషన్‌లో పేర్కొంది. జనవరి 14, 15, 16ను సాధారణ సెలవుల జాబితాలో చేర్చింది. భోగి, సంక్రాంతి, దుర్గాష్టమి, దీపావళి రెండో శనివారం, ఆదివారం వచ్చాయని తెలిపింది. మార్చి 22న ఉగాది సెలవుగా ప్రకటించింది. రంజాన్‌, బక్రీద్‌, మొహర్రం, మిలాద్‌ఉన్‌నబీ తేదీల్లో మార్పులు చేర్పులు జరిగాయని ఏపీ ప్రభుత్వం నోటిఫికేషన్‌లో వెల్లడించింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని