TSRTC: ‘జనరల్‌ రూట్‌ పాస్‌’తో బస్సులో ఎన్నిసార్లయినా తిరగొచ్చు: టీఎస్‌ఆర్టీసీ

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో తక్కువ దూరం ప్రయాణించే వారి కోసం తొలిసారిగా ‘జనరల్ రూట్ పాస్’ను టీఎస్‌ఆర్టీసీ ప్రారంభించనుంది. మే 27నుంచి అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు సంస్థ ఓ ప్రకటనలో పేర్కొంది.

Published : 25 May 2023 20:41 IST

హైదరాబాద్‌: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ప్రయాణికుల కోసం తొలిసారిగా ‘జనరల్ రూట్ పాస్’ను టీఎస్‌ఆర్టీసీ ప్రారంభించనుంది. తక్కువ దూరం ప్రయాణించే వారి కోసం ఈ రూట్ పాస్‌ను తీసుకురానుంది. 8కి.మీ. పరిధిలో రాకపోకలకు వర్తించే రూట్‌ బస్‌ పాస్‌ను మే27 నుంచి అందుబాటులోకి వస్తుందని సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. ఈమేరకు టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ ట్వీట్‌ చేశారు.

సిటీ ఆర్డీనరీ రూట్ బస్ పాస్‌కు నెలకు ₹600గా, మెట్రో ఎక్స్‌ప్రెస్ పాస్‌కు ₹1000గా ధరను నిర్ణయించింది. పాస్‌ ధరతో పాటు ఐడీ కార్డుకు రూ.50 అదనంగా చెల్లించాల్సి ఉంటుందని సంస్థ ప్రకటనలో పేర్కొంది. తొలుత హైదరాబాద్‌లోని 162 రూట్లలో ఈ పాస్‌ను ప్రయాణికులకు ఇవ్వనున్నట్లు తెలిపింది. ఈ రూట్ పాస్‌లతో 8 కి.మీ. పరిధిలో అపరిమితంగా ఎన్నిసార్లైన బస్సులో ప్రయాణించే వెసులుబాటును సంస్థ కల్పించింది. సెలవు దినాలతో పాటు ఆదివారాల్లోనూ ప్రయాణించవచ్చని వెల్లడించింది.

పాస్‌కు సంబంధించిన రూట్ల వివరాల కోసం http://tsrtc.telangana.gov.in, https://online.tsrtcpass.in వెబ్ సైట్లను సంప్రదించివచ్చని టీఎస్ఆర్టీసీ సూచించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని