దిల్లీ మెట్రో రైళ్లలో ఉచిత వైఫై..!

నేటి నుంచి దిల్లీ మెట్రో రైళ్లల్లో ఉచిత వైఫై అందుబాటులోకి రానుంది. దిల్లీ ఎయిర్‌పోర్టు ఎక్స్‌ప్రెస్‌ లైన్‌ మెట్రోలో దీనిని అందుబాటులోకి తెస్తున్నారు. దిల్లీ మెట్రో రైలు కార్పొరేషన్‌ తొలిసారి రైళ్లలో దీనిని ప్రారంభిస్తోంది. సంస్థ ఎండీ మంగు సింగ్‌ ఈ సేవలను ప్రారంభించనున్నారు. 

Published : 02 Jan 2020 11:53 IST

దిల్లీ: నేటి నుంచి దిల్లీ మెట్రో రైళ్లల్లో ఉచిత వైఫై అందుబాటులోకి వచ్చింది. దిల్లీ ఎయిర్‌పోర్టు ఎక్స్‌ప్రెస్‌ లైన్‌ మెట్రోలో దీనిని అందుబాటులోకి తెచ్చారు. దిల్లీ మెట్రో రైలు కార్పొరేషన్‌ తొలిసారి రైళ్లలో దీనిని ప్రారంభించింది. సంస్థ ఎండీ మంగు సింగ్‌ ఈ సేవలను ప్రారంభించారు. 
దిల్లీ మెట్రో ఎయిర్‌పోర్టు లైన్‌ మొత్తం ఆరు స్టేషన్లతో 22 కిలోమీటర్ల పొడవునా ఉంది. దిల్లీ ఎయిర్‌పోర్టు మెట్రోలైన్‌ను 2011లో ప్రారంభించారు. రిలయన్స్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ సంస్థ భాగస్వామ్యంతో దీనిని నిర్మించారు. 2013 రిలయన్స్‌ ఇన్‌ఫ్రా దీని నుంచి వైదొలగ్గా.. డీఎంఆర్‌సీ పూర్తి వాటాను సొంతం చేసుకొంది.  ఎయిర్‌పోర్టు లైన్‌లోని ఆరు మెట్రోస్టేషన్లలో ఉచిత వైఫై సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని