‘దిశ’ అమలుకు ఇద్దరు అధికారులు

ఆంధ్రప్రదేశ్‌లో దిశ చట్టం అమలు చేయడానికి ప్రభుత్వం ముందడుగు వేసింది. చట్టం అమలు చేయడానికి ఇద్దరు ప్రత్యేక అధికారులను నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.

Published : 03 Jan 2020 00:54 IST

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో దిశ చట్టం అమలు చేయడానికి ప్రభుత్వం ముందడుగు వేసింది. చట్టం అమలు చేయడానికి ఇద్దరు ప్రత్యేక అధికారులను నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఐఏఎస్ అధికారి కృతికా శుక్లా, ఐపీఎస్ అధికారి దీపికలను ప్రత్యేకాధికారులుగా నియమిస్తూ ఆదేశాలు ఇచ్చారు. మహిళా శిశు సంక్షేమశాఖ డైరెక్టర్‌గా ఉన్న కృతికా శుక్లా ప్రస్తుతం ఆదే పోస్టులో దిశ చట్టం అమలును పర్యవేక్షించనున్నారు. దీపిక డీజీపీ కార్యాలయంలోని సీఐడీ విభాగం నుంచి ఈ చట్టం అమలును పర్యవేక్షించనున్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు