ఆ కాలనీలో ఇంటికో నామినేషన్‌ వేస్తారట..!

పాలమూరులోని ఓ కాలనీవాసులు వినూత్న పోరాటానికి సన్నద్ధం అవుతున్నారు. తమ నిరసనను తెలియజేసేందుకు రానున్న మున్సిపల్‌ ఎన్నికల్లో మూకుమ్మడిగా నామినేషన్లు వేసేందుకు సిద్ధమవుతున్నారు. ప్రతి ఇంటి నుంచి ఒకరు తప్పనిసరిగా నామినేషన్‌..

Published : 04 Jan 2020 00:45 IST

మహబూబ్‌నగర్‌: గతేడాది జరిగిన నిజామాబాద్‌ లోక్‌సభ ఎన్నికల్లో పెద్ద సంఖ్యలో పసుపు రైతులు నామినేషన్లు వేసి దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఇదే తరహాలో తమ నిరసను తెలియజేసేందుకు పాలమూరులోని ఓ కాలనీవాసులు వినూత్న పోరాటానికి సన్నద్ధం అవుతున్నారు. తమ నిరసనను తెలియజేసేందుకు రానున్న మున్సిపల్‌ ఎన్నికల్లో మూకుమ్మడిగా నామినేషన్లు వేసేందుకు సిద్ధమవుతున్నారు. ప్రతి ఇంటి నుంచి ఒకరు తప్పనిసరిగా నామినేషన్‌ వేయాలనే చర్చ అక్కడ జోరుగా సాగుతోంది. కాలనీ హద్దులు నిర్ణయించడంలో అధికారులు చూపిస్తున్న నిర్లక్ష్యానికి నిరసనగా ఇలా మూకుమ్మడిగా పురపోరులో నిలవాలని కాలనీవాసులు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మరిన్ని వివరాల కోసం ఈ వీడియోలో చూడండి..

 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని