బయోడైవర్సిటీ పైవంతెన పునఃప్రారంభం

43 రోజుల తర్వాత గచ్చిబౌలి బయోడైవర్సిటీ పై వంతెనపై రాకపోకలు పునరుద్ధరించారు. వంతెనపై వేగనియంత్రణ కోసం చేపట్టిన పనులను మేయర్‌ బొంతు రామ్మోహన్‌, సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ అధికారులతో కలిసి శనివారం

Updated : 04 Jan 2020 14:35 IST

హైదరాబాద్‌: 43 రోజుల తర్వాత గచ్చిబౌలి బయోడైవర్సిటీ పై వంతెనపై రాకపోకలు పునరుద్ధరించారు. వంతెనపై వేగనియంత్రణ కోసం చేపట్టిన పనులను మేయర్‌ బొంతు రామ్మోహన్‌, సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ అధికారులతో కలిసి శనివారం ఉదయం పరిశీలించారు. ప్రారంభించిన కొద్దిరోజుల్లోనే వంతెనపై ఘోర రోడ్డు ప్రమాదాలు జరిగిన విషయం తెలిసిందే. ఇటీవల జరిగిన కారు ప్రమాదం అనంతరం ఫ్లై ఓవర్‌ను తాత్కాలికంగా మూసేశారు. అనంతరం వంతెన నిర్మాణంలో లోపాలపై అధ్యయానికి  ప్రభుత్వం నిపుణుల కమిటీని నియమించింది. నిపుణుల కమిటీ సూచన మేరకు వేగ నియంత్రణకు జీహెచ్‌ఎంసీ చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో మేయర్‌, సీపీ అధికారులతో కలిసి పనులను పరిశీలించారు. ఇవాళ ఉదయం నుంచి వంతెనపై రాకపోకలను పునఃప్రారంభించారు. వాహనదారులు 40 కి.మీ వేగం మించకుండా భద్రతా చర్యలు చేపట్టామని మేయర్‌ తెలిపారు. పై వంతెన నిర్మాణంలో ఎలాంటి లోపాలు లేవని కమిటీ తేల్చిందన్నారు. వంతెనపై స్వీయచిత్రాలు దిగకుండా సైడ్‌ వాల్స్‌ ఏర్పాటు చేస్తామన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానా విధిస్తామని హెచ్చరించారు. సీసీ కెమెరాలు, స్పీడ్‌ గన్స్‌, వేగ నియంత్రికలు ఏర్పాటు చేశామన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని