జేసీ అనుచరుడి ఆత్మహత్యాయత్నం

పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డికి బెయిల్‌ ప్రక్రియ ఆలస్యం చేస్తున్నందుకు నిరసనగా ఆయన అనుచరుడు ఆత్మహత్యాయత్నం

Published : 04 Jan 2020 18:33 IST

అనంతపురం: పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డికి బెయిల్‌ ప్రక్రియ ఆలస్యం చేస్తున్నందుకు నిరసనగా ఆయన అనుచరుడు ఆత్మహత్యాయత్నం చేశాడు. అనంతపురం గ్రామీణ పోలీస్‌స్టేషన్ ఎదుట పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకునేందుకు యత్నించాడు. పోలీసులు ఆ యువకుడిని అడ్డుకొని అదుపులోకి తీసుకున్నారు. బెయిల్‌కోసం వచ్చిన జేసీని పోలీసులు ఉదయం నుంచీ స్టేషన్‌లోనే కూర్చోబెట్టారని యువకుడు ఆరోపిస్తున్నాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని