స్వాతంత్ర్య సాధనలో ఆంధ్రుల పాత్ర కీలకం

దేశ స్వాతంత్ర్య సాధనలో ఆంధ్రప్రాంత ప్రజల పాత్ర కీలకమని గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ అన్నారు. విజయవాడ సిద్ధార్థ కళాశాల ఆడిటోరియంలో సమతా పార్టీ మాజీ జాతీయ అధ్యక్షుడు కృష్ణారావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఆత్మీయ కలయికలో ఆయన ముఖ్య  

Published : 04 Jan 2020 22:58 IST

గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌

విజయవాడ: దేశ స్వాతంత్ర్య సాధనలో ఆంధ్రప్రాంత ప్రజల పాత్ర కీలకమని గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ అన్నారు. విజయవాడ సిద్ధార్థ కళాశాల ఆడిటోరియంలో సమతా పార్టీ మాజీ జాతీయ అధ్యక్షుడు కృష్ణారావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఆత్మీయ కలయికలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మహాత్మాగాంధీ 150వ జయంతి ఉత్సవాల నేపథ్యంలో స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొన్న యోధులను ఈ సందర్భంగా గవర్నర్‌ సన్మానించి జ్ఞాపికలను అందజేశారు.

ఆత్మీయ కలయిను ఓ సామాజిక కలయికగా అభివర్ణించిన గవర్నర్‌.. ఐదేళ్లుగా ఈ కలయికను నిర్వహించడంపై నిర్వాహకులను అభినందించారు. ఈ సందర్భంగా బిశ్వభూషణ్‌ మాట్లాడుతూ..  ఈ దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన ముగ్గురు యోధులకు సన్మానం చేయడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. ‘‘ఈ సన్మానం వారికి దక్కిన గౌరవంగా కాకుండా.. సన్మానం చేయడం నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాను. స్వాతంత్ర్యం కోసం ఆంధ్రప్రదేశ్‌లో నాడు జరిగిన ఉద్యమానికి దేశ నలుమూలలలా అభినందనలు దక్కాయి’’ అని బిశ్వభూషణ్ అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు