సొంత నియోజకవర్గంలో ఎమ్మెల్యే రోజాకు చేదు అనుభవం

చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గ వైకాపా ఎమ్మెల్యే రోజాకు చేదు అనుభవం ఎదురైంది. ఎమ్మెల్యేను ఊరిలోకి రాకుండా కేబీఆర్‌ పురంలో

Updated : 05 Jan 2020 17:18 IST

నగరి: చిత్తూరు జిల్లా నగరి వైకాపా ఎమ్మెల్యే రోజాకు సొంత నియోజకవర్గంలోనే చేదు అనుభవం ఎదురైంది. ఎమ్మెల్యేను ఊరిలోకి రాకుండా పుత్తూరు మండలం కేబీఆర్‌ పురం వైకాపా నాయకులు అడ్డుకున్నారు. సొంతపార్టీ నాయకులకు కాకుండా తెదేపా వారికి ప్రాధాన్యం ఇస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామ సచివాలయ శంకుస్థాపనకు వచ్చిన రోజాను ఈమేరకు వైకాపా నాయకులు నిలదీశారు. దీంతో పోలీసులు కలగజేసుకుని గ్రామస్థులకు సర్దిచెప్పారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని