
నక్కినా.. చిక్కింది!
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని పల్గుల గ్రామానికి సమీప అటవీ ప్రాంతంలోని నీటి గుంతలో నక్కిన భారీ మొసలి ఇది. గొర్రెల కాపరులు ఆదివారం దాన్ని గుర్తించారు. వారిచ్చిన సమాచారం మేరకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అక్కడికి చేరుకోగా, ఆ అలికిడికి అది పక్కనే ఉన్న పొదల్లోకి జారుకుంది. దాన్ని గుర్తించేద]ుకు అటవీశాఖ అధికారులు, పోలీసులు దాదాపు రెండు గంటలపాటు శ్రమించారు. ఎట్టకేలకు బంధించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలో గోదావరి నదిలో ప్రవాహం తగ్గడంతో మొసళ్లు బయటకు వస్తున్నాయని, మత్స్యకారులు, పరీవాహక ప్రాంతాల రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.
- న్యూస్టుడే, కాళేశ్వరం
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.