Published : 07 Jan 2020 11:14 IST

దేవినేని ఉమా నివాసం వద్ద ఉద్రిక్తత

విజయవాడ: మాజీ మంత్రి, తెదేపా సీనియర్‌ నేత దేవినేని ఉమామహేశ్వరరావు ఇంటి వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఉమా గృహనిర్బంధాన్ని నిరసిస్తూ తెదేపా శ్రేణులు పెద్ద ఎత్తున  ఆయన ఇంటి వద్దకు చేరుకున్నారు. ఈక్రమంలో ఉమా బలవంతంగా ఇంటి నుంచి బయటకు వచ్చారు. ఉమా, కార్యకర్తలు.. పోలీసులను నెట్టుకుని ర్యాలీగా బయలుదేరారు. జై అమరావతి అంటూ తెదేపా కార్యకర్తలు నినాదాలు చేశారు. 

విజయవాడలో ఎంపీ కేశినేని నానిని పోలీసులు గృహనిర్బంధం చేశారు. ఉదయం నుంచి ఆయన నివాసం వద్ద భారీగా పోలీసులు మోహరించారు. ఈ సందర్భంగా పోలీసులు, కేశినేనికి మధ్య వాగ్వాదం జరిగింది. తెదేపా ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్‌ను గృహనిర్బంధంలో ఉంచారు. ఉయ్యూరు సీఐ పర్యవేక్షణలో టౌన్‌ ఎస్సై, రూరల్‌ ఎస్సైలు, 30 మంది సిబ్బంది మూడు జీపులలో వచ్చి రాజేంద్రప్రసాద్‌ నివాసం వద్ద మోహరించారు.

Read latest General News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని