‘వివేకా హత్య కేసు సీబీఐకి ఇవ్వొద్దు’

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యకేసు దర్యాప్తును సీబీఐకి ఇచ్చేలా ఆదేశించాలంటూ తెదేపా నేత బీటెక్‌ రవి, మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి, వివేకా సతీమణి సౌభాగ్యమ్మ తదితరులు దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టులో...

Published : 08 Jan 2020 16:15 IST

హైకోర్టుకు తెలిపిన ఏపీ అడ్వకేట్‌ జనరల్‌

అమరావతి: మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యకేసు దర్యాప్తును సీబీఐకి ఇచ్చేలా ఆదేశించాలంటూ తెదేపా నేత బీటెక్‌ రవి, మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి, వివేకా సతీమణి సౌభాగ్యమ్మ తదితరులు దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టులో విచారణ జరిగింది. సౌభాగ్యమ్మ వేసిన అనుబంధ పిటిషన్‌పై ఈనెల 19లోపు కౌంటర్‌ దాఖలు చేయాలని అడ్వకేట్‌ జనరల్‌ను ధర్మాసనం ఆదేశించింది. అప్పటివరకూ తుది నివేదికను రూపొందించవద్దని సిట్‌కు సూచించింది. మరోవైపు ప్రభుత్వం తరఫున అడ్వకేట్‌ జనరల్‌ వాదనలు వినిపించారు. ఈ కేసులో సిట్‌ విచారణ తుది దశలోఉందని.. ఈ సమయంలో దర్యాప్తును సీబీఐకి ఇవ్వాల్సిన అవసరం లేదని న్యాయస్థానానికి తెలిపారు. ఇరువైపు వాదనలు విన్న హైకోర్టు.. తదుపరి విచారణను ఈనెల 20కి వాయిదా వేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని