స్థానిక ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి:ఎస్‌ఈసీ

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక ఎన్నికల నిర్వహణకు అవసరమైన ప్రాథమిక ఏర్పాట్లన్నీ పూర్తి చేశామని రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌ అన్నారు. ఈనాడు-ఈటీవీ ప్రత్యేక ముఖాముఖిలో ఆయన మాట్లాడారు.

Published : 08 Jan 2020 18:48 IST

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక ఎన్నికల నిర్వహణకు అవసరమైన ప్రాథమిక ఏర్పాట్లన్నీ పూర్తి చేశామని రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌ అన్నారు. ఈనాడు-ఈటీవీ ప్రత్యేక ముఖాముఖిలో ఆయన మాట్లాడారు. ఎన్నికల నిర్వహణ విషయంలో పూర్తి సన్నద్ధతతో ఉన్నామని.. బ్యాలెట్‌ పేపర్ల ముద్రణ కూడా పూర్తి అయిందని పేర్కొన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా శాంతియుత వాతావరణంలో ఎన్నికలు జరిపేందుకు చేయాల్సిన ఏర్పాట్లపై ఇప్పటికే పోలీసుశాఖతో చర్చించినట్లు చెప్పారు. జిల్లా అధికారులను సంప్రదించామని.. ఎన్నికల నిర్వహణకు వారు సిద్ధంగా ఉన్నారన్నారు. రిజర్వేషన్ల చట్టబద్ధతపై ఎన్నికల సంఘానికి సంబంధం లేదని.. అది ప్రభుత్వం నిర్ణయిస్తుందని వివరించారు. మార్చి నెలలో పాఠశాలలు, కళాశాలలకు పరీక్షలు జరగనున్న నేపథ్యంలో ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మార్చి 3వ తేదీలోగా లోగా స్థానిక ఎన్నికల ప్రక్రియ పూర్తి చేసేలా అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని