అమ్మఒడి పథకం ప్రారంభించిన జగన్‌

చిత్తూరులో అమ్మ ఒడి పథకాన్ని ఏపీ సీఎం జగన్‌ మోహన్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సీఎం మాట్లాడుతూ.. వచ్చే...

Updated : 09 Jan 2020 14:03 IST

చిత్తూరు: చిత్తూరులో అమ్మ ఒడి పథకాన్ని ఏపీ సీఎం జగన్‌ మోహన్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సీఎం మాట్లాడుతూ.. వచ్చే విద్యాసంవత్సరం ఒకటి నుంచి ఆరోతరగతి వరకు ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెడతామని ప్రకటించారు. ఆ తరువాత ఒక్కో ఏడాది ఒక్కో తరగతి పెంచుకుంటూ వెళ్తామన్నారు. ఆంగ్ల మాధ్యమం ద్వారా కొన్ని ఇబ్బందులు వస్తాయని వాటిని అధిగమిస్తామని తెలిపారు. ఇవాళ విమర్శించే వాళ్లంతా వారిపిల్లలను ఆంగ్లమాధ్యమంలోనే చదివిస్తున్నారని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల్లో సిలబస్‌ కూడా మార్చే కార్యక్రమం చేస్తున్నామన్నారు. మధ్యాహ్న భోజన పథకం మెనూ కూడా మార్చామని వివరించారు.    
‘పిల్లల చదువు తల్లికి భారం కాకూడదు. పిల్లలకు మనమిచ్చే ఆస్తి చదువు. 43 లక్షల మంది తల్లులకు వారి బ్యాంకు ఖాతాల్లో రూ.15వేలు జమచేస్తాం. దాదాపు 81 లక్షల మంది పిల్లలకు అమ్మ ఒడి పథకం ద్వారా ప్రయోజనం కలుగుతుంది. వచ్చే ఏడాది నుంచి 75శాతం విద్యార్థుల హాజరు తప్పని సరి చేస్తాం. మేనిఫెస్టోలో ఒకటి నుంచి పదోతరగతి వరకు అని చెప్పినా.. ఇంటర్‌ వరకు ఈ పథకాన్ని పొడిగించాం’’  అని జగన్‌ తెలిపారు. 

పాఠశాలకు రూ.1000 ఇవ్వాలి

అమ్మ ఒడి పథకం ద్వారా ప్రభుత్వం ఇచ్చే రూ.15వేలలో వెయ్యి రూపాయలు పాఠశాలకు ఇవ్వాలని విద్యార్థుల తల్లిదండ్రులను సీఎం కోరారు. పాఠశాలల్లో మౌలిక సౌకర్యాలకోసం ఆ డబ్బులు ఖర్చుచేస్తామని తెలిపారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని