జేఎన్‌యూ దాడి విచారణకు ప్రత్యేక కమిటీ

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన జేఎన్‌యూ ఘటనపై విచారణకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేశారు. ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీ ఏర్పాటు చేసి నిజానిజాలు నిగ్గు తేల్చనున్నట్లు జేఎన్‌యూ ఉపకులపతి ఎం.జగదీశ్‌కుమార్‌ పేర్కొన్నారు.

Published : 09 Jan 2020 18:19 IST

దిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన జేఎన్‌యూ ఘటనపై విచారణకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేశారు. ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీ ఏర్పాటు చేసి నిజానిజాలు నిగ్గు తేల్చనున్నట్లు జేఎన్‌యూ ఉపకులపతి ఎం.జగదీశ్‌కుమార్‌ పేర్కొన్నారు. దీనికి సంబంధించి వర్సిటీ రిజిస్ట్రార్‌ డా.ప్రమోద్‌కుమార్‌ గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. కమిటీలో ఐదుగురు ప్రొఫెసర్లు ప్రొ.సుశాంత్‌మిశ్రా, ప్రి.మజహర్‌ ఆసిఫ్‌, ప్రొ.సుధీర్‌ప్రతాప్‌సింగ్‌, ప్రొ.సంతోశ్‌శుక్లా, డా.భస్వతీదాస్‌ ఉన్నారు. దాడిపై విచారణ త్వరితగతిన పూర్తి చేసి వెంటనే నివేదిక సమర్పించనున్నారు. జనవరి 5న సాయంత్రం జవహర్‌లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయంలోకి ముసుగులతో ప్రవేశించిన కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు కర్రలు, ఇనుపరాడ్లతో విద్యార్థులు, అధ్యాపకులపై దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో విద్యార్థి సంఘం అధ్యక్షురాలు అయిషే ఘోష్‌ తీవ్రంగా గాయపడగా మరో 30 మంది సైతం గాయపడి ఆసుపత్రి పాలయ్యారు. వీరందరినీ ఎయిమ్స్‌లో చేర్పించి చికిత్స అందించారు. ఈ దాడిని పార్టీలకతీతంగా రాజకీయ నేతలతో పాటు పలువురు క్రీడాకరులు, సినిమా ప్రముఖులు ఖండించిన విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని