పాపం.. ఈ పాము..

భూమ్మీద ప్లాస్టిక్‌ వ్యర్థాల స్థాయి నానాటికీ పెరిగిపోతోంది. మనుషులతో పాటు, జంతుజాలం కూడా వీటి బారిన పడి ఎన్నో సమస్యలు

Published : 11 Jan 2020 00:37 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: భూమ్మీద ప్లాస్టిక్‌ వ్యర్థాల స్థాయి నానాటికీ పెరిగిపోతోంది. మనుషులతో పాటు, జంతుజాలం కూడా వీటి బారిన పడి ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నాయి. జంతువులు ప్లాస్టిక్‌ వ్యర్థాల బారిన పడి ఎలా బాధపడుతున్నాయో చెప్పే ఓ వీడియో తాజాగా అంతర్జాలంలో వైరల్‌గా మారింది. ఆహారానికి, ప్లాస్టిక్‌కూ తేడా తెలియని ప్రాణులు ఎలా నరకం అనుభవిస్తున్నాయో దీనిలో మనం చూడవచ్చు. ఒక పాము ఏదో తిన్నట్టుగా దాని పొట్ట ఉబ్చి ఉంది. అక్కడే ఉన్న ఓ వ్యక్తి దాన్ని కర్రతో అదిలించగా ఆ పాము మింగిన దాన్ని తిరిగి కక్కేసింది. ఇంతకీ ఆ పాము నోటి నుంచి ఏం బయటకు వచ్చిందో తెలుసా? ఒక ప్లాస్టిక్‌ బాటిల్‌. నోరులేని జీవాలకు ప్లాస్టిక్‌ ప్రమాదకరంగా పరిణమించిందనటానికి బాధాకరమైన ఈ వీడియో ప్రత్యక్ష నిదర్శనం అని నెటిజన్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని