
రాజధాని ఉద్యమంలో ఆగిన మరో గుండె
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మూడు రాజధానుల ప్రతిపాదనతో అమరావతి అట్టుడుకుతోంది. అమరావతిలోనే రాజధాని కొనసాగించాలంటూ ప్రజలు ఆందోళనబాట పట్టారు. గత కొన్ని రోజులుగా జరుగుతున్న ఈ ఉద్యమం నేపథ్యంలో శుక్రవారం ఓ మహిళా రైతు కూలీ గుండె ఆగింది. ఈ పోరాటంలో పాల్గొన్న వెంకటపాలెం గ్రామానికి చెందిన నందకుమారి గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయారు. రాజధాని తరలిపోతుందనే ఆందోళనతోనే ఆమె గుండెపోటుకు గురై మరణించినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. రాజధాని కోసం రైతుల పోరాటంలో ఇప్పటిదాకా దాదాపు 10 మందికి పైగా రైతులు, రైతు కూలీలు ప్రాణాలు కోల్పోయారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.