Published : 11 Jan 2020 00:38 IST

మేమేమైనా వీధి రౌడీలమా?: మహిళల ఆగ్రహం

విజయవాడ: అమరావతిలోనే రాజధాని కొనసాగించాలని డిమాండ్‌ చేస్తూ గత కొన్ని రోజులుగా పోరుబాట పట్టిన రైతులకు మద్దతుగా మహిళలు చేపట్టిన పాదయాత్ర ఉద్రిక్తతకు దారితీసింది. విజయవాడ పీడబ్ల్యూడీ గ్రౌండ్స్‌ నుంచి బెంజ్‌ సర్కిల్‌ వరకూ ర్యాలీగా వెళ్లిన మహిళలను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకొని అరెస్టు చేశారు. ఈ క్రమంలో తమపై పోలీసులు వ్యవహరించిన తీరుపై మహిళలు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. తాము చేసిన నేరమేంటో చెప్పాలని ప్రశ్నించారు. వ్యక్తిగత పనులపై వెళ్లే వారిని సైతం పోలీసులు అరెస్టు చేస్తున్నారంటూ మహిళలు అభ్యంతరం వ్యక్తం చేశారు.

మూడు ముక్కల రాజధాని వద్దే వద్దు అంటూ నినాదాలు చేసుకుంటూ భారీ ర్యాలీ నిర్వహించారు. శాంతియుతంగా ర్యాలీ చేస్తున్న తమను పోలీసులు పశువుల కన్నా హీనంగా లాక్కెళ్లారని ఆవేదన వ్యక్తంచేశారు. వీళ్లు అసలు పోలీసులేనా? అంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇంత జరుగుతున్నా హోంమంత్రి సుచరిత స్పందించకపోవడంపై అసంతృప్తి వ్యక్తంచేశారు.

‘‘మేం వీధి రౌడీలమా? మా వద్ద బాంబులు ఉన్నాయా? కత్తులు ఉన్నాయా? యువత భవిష్యత్తును నాశనం చేస్తున్నారు. ఎవరిపైనో కక్ష పెంచుకొని ఏం చేస్తున్నారో అర్థం కావట్లేదు. పాలకులుగా ఉండేవాళ్లు మాత్రం ఇలా చేయకూడదు. ఒక సీఎం అంటే రాజుతో సమానం. ఐదేళ్లు పరిపాలించారంటే ప్రజలకు ఇరవయ్యేళ్లు గుర్తుండాలి. ఇకనైనా సీఎం జగన్‌ తన నిర్ణయాన్ని మార్చుకొని అమరావతిలోనే రాజధాని కొనసాగించాలి. మూడు రాజధానులు అనవసరం.. అభివృద్ధి వికేంద్రీకరణ చేయవచ్చు గానీ రాజధానిని మార్చాల్సిన అవసరంలేదు’’ అని పేర్కొన్నారు.

అంతకుముందు రాజధాని రైతుల పోరాటానికి మద్దతుగా మహిళలు పాదయాత్ర నిర్వహించేందుకు ప్రయత్నించారు. పోలీసులు ఆంక్షలు విధించినప్పటికీ మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చి బందరు రోడ్డుపై బైఠాయించారు. మరోవైపు, పాదయాత్రకు అనుమతిలేదని పోలీసులు వారిని నిలువరించారు. అయితే, నల్ల వస్త్రాలను ధరించిన మహిళలు అమరావతిలోనే రాజధాని కొనసాగించాలంటూ నినాదాలు చేశారు. ఈ క్రమంలో పోలీసులు ఎక్కడికక్కడ మహిళలను అడ్డుకొని బలవంతంగా లాక్కెళ్లి ఆర్టీసీ బస్సులు, ఆటోల్లో తరలించారు. మహిళల ఆందోళనతో విజయవాడలో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది.  రాజధాని సమస్య కేవలం ఒక్కరిది కాదని.. అన్ని ప్రాంతాలకు, వర్గాలకు చెందినదని చెబుతున్నా పోలీసులు తమ ఆవేదనను వినకుండా బలవంతంగా లాక్కెళ్తున్నారంటూ మహిళలు మండిపడ్డారు. 

 

 


Read latest General News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని