పంతంగి వద్ద 2 కి.మీ. మేర నిలిచిన వాహనాలు

పండగకు వెళ్లే ప్రయాణికులతో యాదాద్రి జిల్లా చౌటుప్పల్‌ మండలం పంతంగి టోల్‌ప్లాజా వద్ద వాహనాలు భారీగా నిలిచిపోయాయి. పెద్ద ఎత్తున ప్రజలు తమ ఊళ్లకు బయల్దేరడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వాహనాలు సాఫీగా వెళ్లేందుకు ఉద్దేశించిన

Updated : 11 Jan 2020 09:59 IST

చౌటుప్పల్‌ గ్రామీణం: సంక్రాంతి పండుగకు వెళ్లే ప్రయాణికుల రద్దీతో యాదాద్రి జిల్లా చౌటుప్పల్‌ మండలం పంతంగి టోల్‌ప్లాజా వద్ద వాహనాలు భారీగా నిలిచిపోయాయి. పెద్ద ఎత్తున ప్రజలు తమ సొంతూళ్లకు బయల్దేరడంతో శనివారం వేకువజామున ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో టోల్‌ప్లాజా వద్ద 2 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. విజయవాడ వైపు వెళ్లే మార్గంలో అత్యధికంగా 11 టోల్‌ బూత్‌లను తెరిచి వాహనాలను పంపిస్తున్నారు. చౌటుప్పల్‌ పోలీసులు, టోల్‌ సిబ్బంది, ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు ట్రాఫిక్‌ను క్రమబద్దీకరిస్తున్నారు. చౌటుప్పల్‌ ఏసీపీ సత్తెయ్య ట్రాఫిక్‌ను సమీక్షిస్తున్నారు. జీఎంఆర్‌ సిబ్బంది వాహనదారుల వద్దకే వచ్చి చేతి యంత్రాలతో టోల్‌ రుసుములు అందిస్తున్నారు. సంక్రాంతి పండుగ కావడం, వారంతపు సెలవులు కలిసి రావడంతో హైదరాబాద్‌ నుంచి పెద్ద ఎత్తున ప్రజలు తమ తమ ఊళ్లకు బయల్దేరారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని