కర్తవ్య నిర్వహణ... మానవతా ధర్మం..

అనాధశవంగా మిగిలిపోవాల్సిన అత్యాచార బాధితురాలికి పోలీసులే అంతిమ సంస్కారాలను నిర్వహించారు.

Published : 12 Jan 2020 01:03 IST

అత్యాచార బాధితురాలికి అంతిమ సంస్కారాల నిర్వహణ

ఆగ్రా: అనాధశవంగా మిగిలిపోవాల్సిన అత్యాచార బాధితురాలికి పోలీసులే అంతిమ సంస్కారాలను నిర్వహించారు. మనసున్న అందరినీ కదిలించే ఈ సంఘటన ఈ శుక్రవారం ఉత్తర్‌ ప్రదేశ్‌ రాష్ట్రం ఆగ్రాలో జరిగింది. ‘‘కొద్ది రోజుల క్రితం ఒక అత్యాచార బాధితురాలు ఆగ్రాలోని ఒక ఆసుపత్రిలో మరణించింది. పోస్ట్‌మార్టం జరిగిన అనంతరం ఆమె మృతదేహాన్ని తీసుకెళ్లటానికి ఎవరూ రాలేదు. దానితో ఆమెకు అంతిమ సంస్కారాలు నిర్వహించే బాధ్యతను మేమే తీసుకున్నాం. ఈ విధమైన చర్యలు పోలీసులు, ప్రజల మధ్య వారధిగా పనిచేస్తాయని ఆశిస్తున్నాం.’’ అని నగర ఎస్పీ బోత్రే రోహన్‌ ప్రమోద్‌ వివరించారు. పోలీసులు మృతురాలికి హిందూ సంప్రదాయం ప్రకారం సక్రమంగా అంత్యక్రియలు నిర్వహించారు. అంతేకాకుండా వారు ఆమె పేరున అన్నదానం కూడా చేయటం విశేషం. కర్తవ్య నిర్వహణే కాకుండా మానవతా ధర్మాన్ని కూడా నిర్వహించిన ఆగ్రా పోలీసుల చర్య అందరి ప్రశంసలను అందుకుంటోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని