‘సీఏఏ’పై చర్చించేందుకు దిల్లీ రమ్మన్నారు 

కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులను వెంటనే విడుదల చేయాని, సీఏఏ, ఎన్‌ఆర్సీ విషయాల్లో పునరాలోచించుకోవాలని ప్రధాని నరేంద్రమోదీని కోరినట్లు పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు.

Published : 12 Jan 2020 00:31 IST

కోల్‌కతా: కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులను వెంటనే విడుదల చేయాని, సీఏఏ, ఎన్‌ఆర్సీ విషయాల్లో పునరాలోచించుకోవాలని ప్రధాని నరేంద్రమోదీని కోరినట్లు పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. కోల్‌కతా పోర్టు ట్రస్ట్‌ 150వ వార్షికోత్సవాల్లో మోదీ పాల్గొనేందుకు కోల్‌కతా చేరుకున్నారు. ఈ నేపథ్యంలో సీఎం మమతతో శనివారం సమావేశమయ్యారు. ఈ సమావేశంలో సీఏఏ, ఎన్‌ఆర్సీతో పాటు నిధుల ఈ విషయాలపై చర్చించినట్లు ఆమె తెలిపారు. కాగా నిధుల విడుదల విషయంలో ప్రధాని సానుకూలంగా స్పందించారని ఆమె పేర్కొన్నారు.
‘మీరు మా అతిథిగా వచ్చారు. ఈ విషయాలు మాట్లాడటానికి ఇది సరైన సమయమో కాదో తెలియదు. కానీ, మేము పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నాం. సీఏఏతో పాటు ఎన్‌ఆర్సీ, ఎన్‌పీఆర్‌లు భారత ప్రజల్లో విభజన ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ విషయంలో మీరు పునరాలోచించాలని కోరుతున్నాం’ అని ప్రధానితో చెప్పినట్లు మమత తెలిపారు. అయితే, ఈ విషయాల్లో మరింత లోతుగా చర్చించేందును తనను దిల్లీ రావాల్సిందిగా ప్రధాని ఆహ్వానించారని ఆమె తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని