సీటు దొరికితే..పండగే..!

సంక్రాంతి సెలవులు ఇచ్చేశారు. సొంతూళ్లకు వెళ్లేవారితో బస్సుస్టాండ్‌, రైల్వేస్టేషన్‌ కిటకిటలాడుతున్నాయి. బస్సు, రైళ్లలో సీటు దొరికితే చాలు పండగే అన్నట్లుగా పరిస్థితి నెలకొంది. వేలాది మంది ఒక్కసారిగా తరలిరావడంతో వచ్చిన బస్సులు, రైళ్లు వచ్చినట్టే కిక్కిరిసి వెళ్తున్నాయి. ప్లాట్‌ఫాంలపై ఏమాత్రం రద్దీ తరగడం లేదు.

Updated : 05 Dec 2021 15:12 IST

రత్నాచల్‌ ఎక్స్‌ప్రెస్‌ వద్ద కిక్కిరిసి..

సంక్రాంతి సెలవులు ఇచ్చేశారు. సొంతూళ్లకు వెళ్లేవారితో బస్సుస్టాండ్‌, రైల్వేస్టేషన్‌ కిటకిటలాడుతున్నాయి. బస్సు, రైళ్లలో సీటు దొరికితే చాలు పండగే అన్నట్లుగా పరిస్థితి నెలకొంది. వేలాది మంది ఒక్కసారిగా తరలిరావడంతో వచ్చిన బస్సులు, రైళ్లు వచ్చినట్టే కిక్కిరిసి వెళ్తున్నాయి. ప్లాట్‌ఫాంలపై ఏమాత్రం రద్దీ తరగడం లేదు.

ఎన్ని బస్సులు వేసినా సరిపోవడం లేదని అధికారులు చెబుతున్నారు. సీట్లు దొరక్క పిల్లాపాపలతో వచ్చిన వారు తీవ్ర అవస్థలు పడుతూ ప్రయాణం సాగిస్తున్నారు. మరో పక్క డిమాండ్‌ను ఆసరాగా చేసుకుని ప్రయివేటు ట్రావెల్స్‌ టికెట్‌ ధరలు విపరీతంగా పెంచేశాయి. రాత్రి ప్రయాణంలో విజయవాడ వరకు రూ.వెయ్యికిపైగా ఛార్జీ వసూలు చేస్తున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్ఛు - చిత్రాలు: ఈనాడు, విశాఖపట్నం

రైల్వేస్టేషన్‌లో ప్రయాణికులతో నిండిపోయిన ప్లాట్‌ఫాం

శ్రీకాకుళం వేళ్లేందుకు పడుతున్న కష్టాలు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని