టాప్‌ 10 న్యూస్‌ - 1 PM

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అంశంపై చర్చించేందుకు ప్రభుత్వం నియమించిన హైపవర్‌ కమిటీ విజయవాడలోని ఆర్టీసీ కాన్ఫరెన్స్‌ హాలులో మూడోసారి సమావేశమైంది. భేటీ అనంతరం మంత్రి పేర్ని నాని మీడియాతో మాట్లాడారు. ఈ నెల 17న మరోసారి సమావేశమవుతామని

Updated : 13 Jan 2020 13:04 IST

1. ఈనెల 17న మరోసారి హైపవర్‌ సమావేశం

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అంశంపై చర్చించేందుకు ప్రభుత్వం నియమించిన హైపవర్‌ కమిటీ విజయవాడలోని ఆర్టీసీ కాన్ఫరెన్స్‌ హాలులో మూడోసారి సమావేశమైంది. భేటీ అనంతరం మంత్రి పేర్ని నాని మీడియాతో మాట్లాడారు. ఈ నెల 17న మరోసారి సమావేశమవుతామని తెలిపారు. రైతులు చెప్పదలచుకున్న అంశాలు రాతపూర్వకంగా ఇవ్వాలని కోరారు. సీఆర్‌డీఏ కమిషనర్‌కు రైతులు నేరుగా లేదా ఆన్‌లైన్‌లో ఇవ్వొచ్చని సూచించారు. ప్రభుత్వానికి నేరుగా సలహాలు, సూచనలు చెప్పొచ్చన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

2. పోలీసుల తీరుపై ఏపీ హైకోర్టులో పిటిషన్‌

రాజధాని గ్రామాల్లో 144 సెక్షన్‌, పోలీస్‌ యాక్టు 30 అమలును సవాల్‌ చేస్తూ రాజధాని ప్రాంత రైతులు హైకోర్టు వెకేషన్‌ బెంచ్‌లో పిటిషన్‌ దాఖలు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా పోలీసులు వ్యవహరిస్తున్నారని  అందులో పేర్కొన్నారు. మధ్యాహ్నం 2.30 సమయంలో ఈ పిటిషన్‌పై హైకోర్టు విచారణ చేపట్టే అవకాశం ఉంది.

3. మంత్రి బొత్సను మేం కలవలేదు: రైతులు

రాజధాని ప్రాంత రైతులు మంత్రి బొత్సను కలిశారనడం అవాస్తవమని వెలగపూడిలో దీక్ష చేస్తున్న రైతులు చెబుతున్నారు. భూములిచ్చిన రైతులను మంత్రులెవరూ సంప్రదించలేదన్నారు. రైతులెవరూ మంత్రులను కలవలేదని స్పష్టం చేశారు. దీక్షలో కూర్చున్న రైతులు మాట్లాడుతూ.. ఇవాళ ఆర్కే ర్యాలీ జరిగితే రేపు 29గ్రామాల్లో రైతుల ర్యాలీలు జరుగుతాయని, తర్వాత జరిగే పరిణామాలకు డీజీపీ సమాధానం చెప్పాల్సి వస్తుందని అన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

4. తెలుగు రాష్ట్రాల సీఎంల సంక్రాంతి శుభాకాంక్షలు

తెలుగు రాష్ట్రాల ప్రజలకు ముఖ్యమంత్రులు కేసీఆర్‌, జగన్‌మోహన్‌రెడ్డి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల జీవితంలో నిత్యం కాంతులు విరజల్లేలా దేవతలు దీవించాలని తెలంగాణ సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు. ప్రజలంతా సంతోషంగా సంక్రాంతి నిర్వహించుకోవాలని అన్నారు. ప్రతీ ఇంటా సుఖశాంతులు, సౌభ్రాతృత్వం, సౌభాగ్యం వెల్లివిరియాలని కోరారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

5. ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అరెస్టు

రాజధాని వికేంద్రీకరణకు మద్దతుగా గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం పెనుమాకలో ర్యాలీ చేపట్టిన వైకాపా ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం వరకు రామకృష్ణారెడ్డి ర్యాలీని నిర్వహించాలని నిర్ణయించారు. అయితే ర్యాలీకి అనుమతి లేదంటూ పోలీసులు ఆయన్ను అడ్డుకున్నారు. కానీ, పాదయాత్ర చేసేందుకు రామకృష్ణ భీష్మించడంతో రామకృష్ణారెడ్డిని అరెస్టు చేసి పోలీసు వాహనంలో మంగళగిరి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

6. పండగ కోసం వెళ్తుండగా ప్రమాదం

కృష్ణా జిల్లా నందిగామ సమీపంలో జాతీయ రహదారిపై ప్రమాదం చోటు చేసుకుంది. ద్విచక్రవాహనాన్ని కారు ఢీ కొట్టిన ఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. సంక్రాంతి కోసం హైదరాబాద్ నుంచి తూర్పు గోదావరి జిల్లాకు దంపతులతోపాటు ఇద్దరు పిల్లలు ద్విచక్రవాహనంపై వెళ్తుండగా.. విజయవాడ వైపు వస్తున్న కారు వారిని ఢీ కొట్టింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

7. శబరిమల వివాదంపై ప్రారంభమైన  విచారణ

శబరిమల వివాదంపై రోజువారీ విచారణను సుప్రీంకోర్టు సోమవారం ప్రారంభించింది. సర్వోన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ బోబ్డే నేతృత్వంలోని తొమ్మిది మంది సభ్యులతో కూడిన ధర్మాసనం ఈ విచారణ చేయనుంది. శబరిమల తీర్పుపై దాఖలైన రివ్యూ పిటిషన్లను తాము పరిశీలించడం లేదని.. ఐదుగురు సభ్యులతో కూడిన ధర్మాసనం సిఫార్సు చేసిన అంశాల పరిశీలనపై విచారణ చేస్తున్నామని సీజేఐతో కూడిన ధర్మాసనం వెల్లడించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

8. డైపర్లు,టెస్టులు.. అప్పుడే మార్చాలి

ఐసీసీ ప్రతిపాదించిన నాలుగు రోజుల టెస్టును టీమిండియా మాజీ డాషింగ్‌ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ తీవ్రంగా వ్యతిరేకించాడు. ‘‘అయిదు రోజుల టెస్టు సంప్రదాయమైనది. జెర్సీలపై పేర్లు, గులాబీ బంతి టెస్టులు బాగానే ఉన్నాయి. అయితే డైపర్‌, అయిదు రోజుల టెస్టు.. వాటి పని పూర్తయినప్పుడే మార్చాలి. ఎందుకంటే తిరిగి ఉపయోగించలేం కాబట్టి. టెస్టు క్రికెట్‌ అంటే 143 ఏళ్లు ఫిట్‌గా ఉన్న వ్యక్తిలాంటిది. దానికో ఆత్మ ఉంది. నాలుగు రోజుల ఆట మంచిదే కానీ అది టెస్టు క్రికెట్‌లో కాదు’’అని సెహ్వాగ్‌ వ్యాఖ్యానించాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

9. ఇరాన్‌కు ట్రంప్‌ మరోసారి హెచ్చరికలు..!

ఇరాన్‌ ప్రభుత్వానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ మరోసారి హెచ్చరికలు జారీ చేశారు. ఉక్రెయిన్‌ విమానాన్ని పొరపాటున తామే కూల్చామని ప్రభుత్వం అంగీకరించిన నేపథ్యంలో ఇరాన్‌లో ప్రజలు సొంత ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఆందోళనకారులను చంపొద్దని ట్రంప్‌ ఇరాన్‌ని హెచ్చరించారు. అమెరికా విధించిన ఆంక్షలు, సొంత దేశంలో ఆందోళనలతో ఇరాన్‌ ఉక్కిరిబిక్కిరి అవుతున్నట్లు తనకు సమాచారం ఉందని ట్రంప్‌ తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

10. రాజస్థాన్‌లో వైభవంగా ఒంటెల పండుగ

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని