రైలు బోగే.. పాఠశాల

రైలులో విద్యార్థులకు పాఠాలు బోధించినట్టు ఎప్పుడైనా విన్నారా. వినకపోతే మైసూర్‌లోని అశోకపురం వెళ్లాల్సిందే. విద్యార్థులకు సకల సౌకర్యాలు ఆ బోగీలో సిద్ధంగా ఉన్నాయి. కూలిపోయే స్థితిలో ఉన్న పాఠశాల నుంచి విద్యార్థులను రక్షించేందుకు ఓ ప్రధానోపాధ్యాయుడు..

Published : 14 Jan 2020 23:49 IST

బెంగళూరు: రైలులో విద్యార్థులకు పాఠాలు బోధించినట్టు ఎప్పుడైనా విన్నారా. వినకపోతే మైసూర్‌లోని అశోకపురం వెళ్లాల్సిందే. విద్యార్థులకు సకల సౌకర్యాలు ఆ బోగీలో సిద్ధంగా ఉన్నాయి. కూలిపోయే స్థితిలో ఉన్న పాఠశాల నుంచి విద్యార్థులను రక్షించేందుకు ఓ ప్రధానోపాధ్యాయుడు చేసిన కృషి ఫలితమే ఈ రైలు బడి. ఎలాగైనా విద్యార్థులకు బోధించాలనే ఆయన నిర్ణయాన్ని ఈ విధంగా నెరవేర్చుకున్నారు. మైసూరు జిల్లా అశోకపురంలో అక్కడి ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాస్‌ ఓ రైలు బోగీని పాఠశాలగా మార్చారు. కూలిపోయే స్థితిలో ఉన్న ప్రభుత్వ పాఠశాలకు మరమ్మతులు చేయాలని విద్యాశాఖ అధికారులను కోరారు. ఎన్ని సార్లు విజ్ఞప్తి చేసినా ప్రయోజనం లేకపోవడంతో ఆయన ఈ వినూత్న ప్రయత్నం చేశారు.

అశోకపురం  రైల్వే గ్యారేజీలో వినియోగంలో లేని రైలు బోగి గురించి తెలుసుకొని శ్రీనివాస్‌ గ్యారేజీ సిబ్బందిని సంప్రదించారు. వారి అనుమతితో రైలు బోగీని అందమైన పాఠశాలగా తీర్చిదిద్దారు. విద్యార్థులకు కావాల్సిన అన్ని సౌకర్యాలను దీనిలో సమకూర్చారు. లోపలి గోడలపై అందమైన కార్టూన్‌ బొమ్మలను వేశారు. భోజనాల గది, శుభ్రమైన శౌచాలయాలను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఇక్కడ ఒకటి నుంచి ఐదు తరగతుల వరకు నిర్వహిస్తున్నారు. కాగా మొత్తం 50 మంది విద్యార్థులు ఇక్కడ చదువుకుంటున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని