రికార్డ్ బద్దలు కొట్టిన ‘1995 కేజీల’ కిచిడీ

హిమాచల్ ప్రదేశ్‌ రాష్ట్రంలోని తట్టపాణి గ్రామంలో మకర సంక్రాంతి సందర్భంగా జరిగిన అన్నదాన కార్యక్రమంలో 1995 కేజీల కిచిడీని..

Published : 16 Jan 2020 10:28 IST

సిమ్లా: హిమాచల్ ప్రదేశ్‌ రాష్ట్రంలోని తట్టపాణి గ్రామంలో మకర సంక్రాంతి సందర్భంగా జరిగిన అన్నదాన కార్యక్రమంలో  1995 కేజీల కిచిడీని హాలిడే హోమ్‌ హోటల్‌ చెఫ్‌లు తయారు చేసి ఔరా అనిపించారు. 275కిలోల బరువు ఉన్న భారీ పాత్రలో తయారు చేసిన ఈ కిచిడీ గిన్నీస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లో చోటు సంపాదించుకుంది. మొత్తం 25 మంది చెఫ్‌లు కలిసి కచిడీని తయారు చేశారు. దీంతో గత ఏడాది ప్రముఖ చెఫ్‌ సంజీవ్‌ కపూర్ తయారు చేసిన 918 కేజీల కిచిడీ రికార్డ్‌ బద్దలైంది. ఇంత మొత్తంలో కిచిడీని రూపొందించడానికి సమారు ఐదు గంటల సమయం పట్టిందని నిర్వాహకులు తెలిపారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకొని 1926 నుంచి తట్టపాణి గ్రామంలో సట్లెజ్‌ నదీ స్నానానికి వచ్చే భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని సంప్రదాయంగా నిర్వహిస్తున్నారు.  


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని