పండగ వేళ బోసిపోయిన హైదరాబాద్‌ రోడ్లు

సంక్రాంతి పండుగకు జనాలు గ్రామాల బాట పట్టడంతో నగరంలోని రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి.

Published : 16 Jan 2020 04:51 IST

హైదరాబాద్‌: సంక్రాంతి పండుగకు నగరవాసులు గ్రామాల బాట పట్టడంతో నగరంలోని రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. కిటకిటలాడే కూడళ్లు బోసిపోయాయి. కోటి జనాభా ఉన్న నగరంలో నిత్యం 50 లక్షల వాహనాలు తిరుగుతూ రహదారిపై రద్దీగా ఉంటాయి. కానీ పండుగ రోజున అతి కొద్ది వాహనాలు మాత్రమే రోడ్డెక్కాయి. ట్రాఫిక్‌ పోలీసులు లేనిదే వాహనాలు ముందుకు కదలని సంఘటనలు చాలా చూశాం. కానీ ప్రస్తుతం ఏ ఒక్క ట్రాఫిక్‌ పోలీసు  కూడళ్ల దగ్గర కనిపించడం లేదు. ట్యాంక్‌బండ్‌, అసెంబ్లీ, ఖైరతాబాద్‌, లిబర్టీ చౌరస్తా, బేగంపేట వంటి ప్రధాన రాహదారులపై వాహన రాకపోకలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. 

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని