రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌పై మహిళా పోలీసు దళం

కర్ణాటకలోని బెంగళూరు పోలీసులు మహిళలకు మద్దతుగా నిలిచి వారిలో ఆత్మవిశ్వాసం నింపేందుకు వినూత్న నిర్ణయం తీసుకున్నారు. ‘వియ్‌ ఫర్‌ ఉమెన్‌’ పేరుతో మహిళా పోలీసులతో బైక్‌ రైడింగ్‌ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

Published : 16 Jan 2020 05:08 IST

బెంగళూరు: కర్ణాటకలోని బెంగళూరు పోలీసులు మహిళలకు మద్దతుగా నిలిచి వారిలో ఆత్మవిశ్వాసం నింపేందుకు వినూత్న నిర్ణయం తీసుకున్నారు. ‘వియ్‌ ఫర్‌ ఉమెన్‌’ పేరుతో మహిళా పోలీసులతో బైక్‌ రైడింగ్‌ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇందుకోసం పోలీసులు రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నారు. సమాజంలో మగవారి ఆధిపత్యాన్ని, జెండర్‌ బేధాలను తొలగించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. నగర డీసీపీ దివ్య సారా థామస్ మాట్లాడుతూ.. బెంగళూరు నగరం మహిళలకు సురక్షితమే అని ఈ పోలీసుల బృందం ద్వారా స్త్రీలకు అవగాహన కల్పించడానికి ఈ కార్యక్రమం ప్రారంభించామన్నారు. ఈ బృందంలో సబ్‌ఇన్‌స్పెక్టర్‌ ర్యాంకు 15 మంది మహిళా పోలీసు అధికారులు ఉన్నారు. వారికి రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ బైక్‌లపై రెండు దశల్లో శిక్షణ ఇస్తున్నామన్నారు. శిక్షణ అనంతరం వారు బెంగళూరు నగర వీధుల్లో గస్తీ తిరుగుతారని తెలిపారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని