1770.. పోలింగ్‌ కేంద్రాలు

పురపాలిక ఎన్నికలకు పోలింగ్‌ కేంద్రాల గుర్తింపు పూర్తయింది. ఈమేరకు ఎన్నికల సంఘం తుది నోటిఫికేషన్‌ విడుదల చేసింది. రెండు జిల్లాలో 1770 పోలింగ్‌ కేంద్రాలు ఎన్నికల కోసం గుర్తించారు. రంగారెడ్డి జిల్లాల్లో మూడు

Published : 16 Jan 2020 07:08 IST

రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లో గుర్తింపు పూర్తి

ఈనాడు, హైదరాబాద్‌: పురపాలిక ఎన్నికలకు పోలింగ్‌ కేంద్రాల గుర్తింపు పూర్తయింది. ఈమేరకు ఎన్నికల సంఘం తుది నోటిఫికేషన్‌ విడుదల చేసింది. రెండు జిల్లాలో 1770 పోలింగ్‌ కేంద్రాలు ఎన్నికల కోసం గుర్తించారు. రంగారెడ్డి జిల్లాల్లో మూడు కార్పొరేషన్లు, 12 మున్సిపాలిటీలు ఉండగా 938 కేంద్రాలు ఏర్పాటు చేశారు. మేడ్చల్‌ జిల్లాలో 4 కార్పొరేషన్లు, 9 మున్సిపాలిటీలు ఉండగా 832 పోలింగ్‌ కేంద్రాలను గుర్తించారు. ఈనెల 22న ఆయా మున్సిపాలిటీలు/కార్పొరేషన్లకు ఎన్నికలు జరగనున్నాయి.
కార్పొరేషన్‌/మున్సిపాలిటీల వారీగా పోలింగ్‌ కేంద్రాలు

రంగారెడ్డి జిల్లాలో..
బడంగ్‌పేట - 132, బండ్లగూడ జాగీర్‌- 85, మీర్‌పేట- 138, పెద్దఅంబర్‌పేట- 63, ఇబ్రహీంపట్నం- 50, జల్‌పల్లి- 84, షాద్‌నగర్‌- 58, శంషాబాద్‌- 53, తుర్కయాంజాల్‌- 55, మణికొండ- 60, ఆదిభట్ల- 30, నార్సింగి- 38, శంకర్‌పల్లి- 30, తుక్కుగూడ- 32, ఆమన్‌గల్‌- 30.

మేడ్చల్‌ జిల్లాలో..
బోడుప్పల్‌- 112, పీర్జాదిగూడ- 78, జవహర్‌నగర్‌- 106, నిజాంపేట- 134, మేడ్చల్‌-46, దమ్మాయిగూడ- 55, నాగారం- 60, పోచారం- 36, ఘట్‌కేసర్‌- 36, గుండ్లపోచంపల్లి- 30, తూంకుంట- 32, కొంపల్లి- 36, దుండిగల్‌-71.

మీర్‌పేటలో అత్యధికం
మీర్‌పేట కార్పొరేషన్‌లో 46 డివిజన్లు ఉన్నాయి. డివిజన్లు/వార్డుల పరంగా రెండు జిల్లాల్లో ఇదే అతిపెద్ద కార్పొరేషన్‌. దీనికి తగ్గట్టుగానే ఇక్కడ పోలింగ్‌ కేంద్రాలు అదికంగా ఉన్నాయి. 138 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇక అత్యల్పంగా ఆదిభట్ల, శంకర్‌పల్లి, గుండ్లపోచంపల్లి, ఆమన్‌గల్‌లో 30 చొప్పున పోలింగ్‌ కేంద్రాలున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని