ఆ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని ఆచూకీ దొరికింది!

సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని రోహిత అదృశ్యం కేసులో దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు ఆమె ఆచూకీ గుర్తించారు. మొత్తం ఐదు ప్రత్యేక బృందాలతో గాలించి చివరకు ఆమె పుణెలో ఉన్నట్టు గుర్తించారు. కుటుంబ కలహాలతోనే తాను...

Published : 16 Jan 2020 07:19 IST

హైదరాబాద్‌: సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని రోహిత అదృశ్యం కేసులో దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు ఆమె ఆచూకీ గుర్తించారు. మొత్తం ఐదు ప్రత్యేక బృందాలతో గాలించి చివరకు ఆమె పుణెలో ఉన్నట్టు గుర్తించారు. కుటుంబ కలహాలతోనే తాను ఇంట్లో నుంచి వెళ్లిపోయినట్టు ఆమె గచ్చిబౌలి పోలీసులకు తెలిపారు. 20 రోజుల కిందట గచ్చిబౌలిలో రోహిత కనిపించకుండా పోయిన ఘటన కలకలం రేపిన విషయం తెలిసిందే. ఆమె పుణెలో ఉన్నట్టు గుర్తించిన పోలీసులు.. హైదరాబాద్‌ తీసుకురానున్నారు.

గత నెల 26న ఇంట్లోనుంచి వెళ్లిన రోహిత బయటకు వెళ్లి తిరిగి రాకపోవడంతో 29న కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అదృశ్యానికి ముందు ఆమె తన బ్యాంకుఖాతా నుంచి రూ.80వేలు డ్రా చేసినట్టు పోలీసులు గుర్తించారు. ఇంటి నుంచివెళ్లే ముందు తన ఫోన్‌ కూడా ఆమెతీసుకెళ్లలేదని ఇటీవల పోలీసులు వెల్లడించారు. దీంతో ఆమె మొబైల్‌ ఫోన్‌ను అన్‌లాక్‌ చేసి కాల్‌ డేటాను సైతం పరిశీలించారు. రోహిత భర్తతో విడిపోయి వేరుగా ఉంటోందని కుటుంబ సభ్యులు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని