దొంగ ఓట్లు వేయకుండా ‘ఫేస్‌ రికగ్నిషన్‌’ యాప్‌

తెలంగాణలో జరగనున్న పురపాలక ఎన్నికల్లో దొంగ ఓట్లు వేయకుండా ‘ఫేస్‌ రికగ్నిషన్‌’ యాప్‌ను ప్రవేశపెడుతున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) వెల్లడించింది. హైదరాబాద్‌లోని కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 10 పోలింగ్ కేంద్రాల్లో పైలట్‌ ప్రాజెక్టుగా ప్రవేశపెట్టనున్నట్లు ఎస్‌ఈసీ...

Published : 17 Jan 2020 00:26 IST

పుర పోరులో పైలట్‌ ప్రాజెక్టుగా ప్రవేశపెట్టనున్న ఎస్‌ఈసీ

హైదరాబాద్‌: తెలంగాణలో జరగనున్న పురపాలక ఎన్నికల్లో దొంగ ఓట్లు వేయకుండా ‘ఫేస్‌ రికగ్నిషన్‌’ యాప్‌ను ప్రవేశపెడుతున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) వెల్లడించింది. హైదరాబాద్‌లోని కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 10 పోలింగ్ కేంద్రాల్లో పైలట్‌ ప్రాజెక్టుగా ప్రవేశపెట్టనున్నట్లు ఎస్‌ఈసీ పేర్కొంది. దీని కోసం ఈ పది పోలింగ్ కేంద్రాల్లో ఒక ప్రత్యేక పోలింగ్ అధికారిని నియమించనున్నట్లు ఎస్‌ఈసీ తెలిపింది. పోలింగ్ కేంద్రాల్లో వెబ్‌ కాస్టింగ్‌తోపాటు వీడియో రికార్డింగ్ చేస్తామని.. వెబ్‌ కాస్టింగ్ లేని పోలింగ్ కేంద్రాల వద్ద మైక్రో అబ్జార్వర్లు అందుబాటులో ఉంటారని ఎస్ఈసీ తెలిపింది. ఎన్నికల నిర్వహణ కోసం 44 వేల మంది సిబ్బంది విధుల్లో ఉంటారని.. వారికి శిక్షణ ఇవ్వడం కూడా పూర్తి అయిందని ఎస్‌ఈసీ వివరించింది. తెలుపు రంగు బ్యాలెట్ పేపర్‌ను వాడుతున్నట్లు వెల్లడించింది. ప్రతి పోలింగ్ స్టేషన్‌లో ఇద్దరు యూనిఫామ్‌ పోలీసులు ఉంటారని తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని