టాప్‌ 10 న్యూస్‌ - 9 AM

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) భారీ ఉపగ్రహాన్ని నింగిలోకి పంపింది. శుక్రవారం తెల్లవారుజామున 2:35 గంటలకు ఫ్రెంచి గయానాలోని కౌరు అంతరిక్ష కేంద్రం నుంచి ఏరియన్‌-5 వాహకనౌక ద్వారా జీశాట్‌ 30 ఉపగ్రహాన్ని 38 నిమిషాల్లో

Published : 17 Jan 2020 09:00 IST

1. జీశాట్-30 ఉపగ్రహ ప్రయోగం విజయవంతం

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) భారీ ఉపగ్రహాన్ని నింగిలోకి పంపింది. శుక్రవారం తెల్లవారుజామున 2:35 గంటలకు ఫ్రెంచి గయానాలోని కౌరు అంతరిక్ష కేంద్రం నుంచి ఏరియన్‌-5 వాహకనౌక ద్వారా జీశాట్‌ 30 ఉపగ్రహాన్ని 38 నిమిషాల్లో నిర్ణీత కక్ష్యలో ప్రవేశపెట్టారు. దీని బరువు 3357 కిలోలు. ఇది కమ్యూనికేషన్‌ ఉపగ్రహం. దీని ద్వారా టెలివిజన్, టెలి కమ్యూనికేషన్‌, బ్రాడ్‌కాస్టింగ్‌ సంబంధించిన మెరుగైన సేవలు అందుబాటులోకి రానున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

2. ఉచితంగా నల్లా కనెక్షన్‌

మున్సిపల్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీని గెలిపిస్తే తెల్లరేషన్‌కార్డున్న అందరికీ ఉచితంగా నల్లా కనెక్షన్‌, ఉచిత మంచి నీటి సరఫరా పథకాన్ని అమలు చేస్తామని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రకటించారు. 500 చదరపు అడుగుల లోపు నిర్మాణ వైశాల్యం ఉన్న ప్రతి ఇంటికీ మున్సిపల్‌ టాక్స్‌ రద్దు చేస్తామని, కొత్త బిల్డింగ్‌ రెగ్యులరైజేషన్‌ స్కీం (బీఆర్‌ఎస్‌) అమలు చేయడంతో పాటు అదనపు గదుల నిర్మాణాలన్నింటినీ క్రమబద్ధీకరణ చేసుకునే అవకాశం కల్పిస్తామన్నారు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

3. అమరావతికి కంఠాభరణం పురోగతికి రాజమార్గం

అమరావతిని సమీపంలోని మరో రెండు నగరాలు, రెండు పట్టణాలతో అనుసంధానిస్తూ ఒక మహా నగరంగా అభివృద్ధి చేసేందుకు ఓఆర్‌ఆర్‌కు బృహత్‌ ప్రణాళిక సిద్ధం చేశారు. దీనికి నాటి రాష్ట్ర ప్రభుత్వం, జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ(ఎన్‌హెచ్‌ఏఐ) కలసి ప్రతిపాదలను రూపొందించాయి. కేంద్ర ప్రభుత్వమూ అనుమతి ఇవ్వడంతో సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌) కూడా తయారైంది. ఇక అవసరమైన భూములను సమీకరించడమే తరువాయి..! వెంటనే పనులు చేపట్టేందుకు ఎన్‌హెచ్‌ఏఐ సిద్ధంగా ఉంది. ఇలాంటి కీలక తరుణంలో రాజధానిని మారిస్తే... రూ.వేల కోట్లతో చేపట్టే ఓఆర్‌ఆర్‌ ప్రాజెక్టు నిలిచిపోయే ప్రమాదముంది. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికీ అది విఘాతమే అవుతుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

4. తెలుపులో బ్యాలెట్‌ పత్రాలు

తెలంగాణలో పురపాలక ఎన్నికల బ్యాలెట్‌ పత్రాల ముద్రణ శుక్రవారం సాయంత్రానికి పూర్తవుతుందని రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి ఎం.అశోక్‌ కుమార్‌ తెలిపారు. ఎన్నికల్లో తెలుపు రంగు బ్యాలెట్‌ పత్రాలను వినియోగిస్తామన్నారు. ఒక్కో వార్డు లేదా డివిజన్‌లో గరిష్ఠంగా పదిమంది కంటే ఎక్కువ మంది పోటీలో లేరని తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

5. ఏరువాక మారిపోనుందా!

ఈ ఏడాది నుంచి నైరుతి రుతుపవనాల రాక, ఉపసంహరణకు సంబంధించిన తేదీలను భారత వాతావరణ విభాగం (ఐఎండీ) మారుస్తున్నట్లు కేంద్ర భూ విజ్ఞాన శాస్త్రాల మంత్రిత్వశాఖ కార్యదర్శి ఎం.రాజీవన్‌ తెలిపారు. వర్షపాత తీరుతెన్నుల్లో మార్పుల వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. పొలాల్లో నాట్లపై నిర్ణయం తీసుకోవడానికి రైతులకు ఇది ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

6. బలప్రయోగం మన విధానం కాదు: మోదీ

వివాదాల పరిష్కారానికి సంప్రదింపులు జరపాలే తప్ప, మూర్ఖంగా బలప్రయోగం చేయరాదన్నది భారతీయ విధానమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. శాంతి, సౌభ్రాతృత్వం ద్వారానే దేశం అభివృద్ధి సాధించిందని తెలిపారు. ‘భారత భావనల ప్రపంచీకరణ’ అనే అంశంపై ఐఐఎం-కొజికోడ్‌ గురువారం నిర్వహించిన సదస్సులో ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రసంగించారు. శాంతియుత సహజీవనం అన్న లక్షణం కారణంగానే భారత్‌ ప్రపంచ దేశాలను ఆకర్షిస్తోందని తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

7. బ్రూ తెగవారు.. ఇక త్రిపుర వాసులే

మిజోరం నుంచి 1997లో త్రిపురకు వలస వచ్చి, అప్పట్నుంచి అక్కడే నివసిస్తున్న 30 వేల మందికిపైగా బ్రూ తెగవారు ఇక త్రిపురలో శాశ్వత నివాసులు కానున్నారు. ఈ మేరకు రూపొందించిన ఒడంబడికపై గురువారం దిల్లీలో హోంమంత్రి అమిత్‌షా సమక్షంలో కేంద్రం, త్రిపుర, మిజోరం అధికారులు సంతకాలు చేశారు. మిజో తెగవారితో ఘర్షణ కారణంగా బ్రూ తెగవారు అప్పట్లో త్రిపురకు వలస వచ్చారు.

8. నగదు చెల్లిస్తే టోల్‌ రాయితీ కట్‌

డిజిటల్‌ చెల్లింపులను ప్రోత్సహించేందుకు అనువుగా నగదు చెల్లింపుదారులపై కేంద్ర ప్రభుత్వం కొరడా ఝుళిపించింది. వెళ్లిన మార్గంలో 24 గంటల్లో తిరిగి వస్తే టోల్‌ట్యాక్స్‌లో తిరుగు ప్రయాణానికి 50% రాయితీ ఇచ్చే విధానం ప్రస్తుతం అమలులో ఉంది. ఇకపై దాన్ని పొందాలంటే ఫాస్టాగ్‌ ఉండాల్సిందేనని, టోల్‌ట్యాక్స్‌ను నగదు రూపంలో చెల్లించే వారికి రాయితీ వర్తించదని కేంద్ర జాతీయ రహదారుల సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) ఉత్తర్వులు జారీచేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

9. భారత్‌ పుంజుకునేనా

వాఖండేలో అనూహ్యంగా చిత్తయిన టీమ్‌ ఇండియా మరో పోరాటానికి సిద్ధమైంది. నేడే ఆస్ట్రేలియాతో రెండో వన్డే. సిరీస్‌లో నిలవాలన్నా, పరువు నిలబెట్టుకోవాలన్నా కోహ్లీసేనకు గెలుపు తప్పనిసరి. మరోవైపు అండర్‌-19 వన్డే ప్రపంచకప్‌ శుక్రవారమే ఆరంభమవుతోంది. తొలి మ్యాచ్‌లో ఆతిథ్య దక్షిణాఫ్రికా జట్టు.. అఫ్గానిస్థాన్‌ను ఢీకొట్టనుంది. 16 జట్లు పోటీ పడే ఈ టోర్నీలో భారత్‌తో పాటు ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌ ఫేవరెట్లుగా బరిలోకి దిగుతున్నాయి. 1 పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి , 2 పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

10. రంగంపేటలో జల్లికట్టు దృశ్యాలు

 

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని