టాప్‌ 10 న్యూస్‌ - 1 PM

సంచలనం సృష్టించిన నిర్భయ అత్యాచారం, హత్య కేసులో దోషి ముఖేశ్ కుమార్‌ సింగ్‌ పెట్టుకున్న క్షమాభిక్ష అభ్యర్థనను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ తిరస్కరించారు. ముఖేశ్‌ పిటిషన్‌ను కేంద్ర హోంశాఖ నిన్న రాష్ట్రపతి భవన్‌కు పంపిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్‌ను

Updated : 17 Jan 2020 13:10 IST

1. నిర్భయ దోషి క్షమాభిక్షను తిరస్కరించిన రాష్ట్రపతి!

సంచలనం సృష్టించిన నిర్భయ అత్యాచారం, హత్య కేసులో దోషి ముఖేశ్ కుమార్‌ సింగ్‌ పెట్టుకున్న క్షమాభిక్ష అభ్యర్థనను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ తిరస్కరించారు. ముఖేశ్‌ పిటిషన్‌ను కేంద్ర హోంశాఖ నిన్న రాష్ట్రపతి భవన్‌కు పంపిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్‌ను తిరస్కరించాలని హోంశాఖ రాష్ట్రపతికి సిఫార్సు చేసింది. ఈ నేపథ్యంలో ముఖేశ్‌ దరఖాస్తును రాష్ట్రపతి నేడు తిరస్కరించినట్లు హోంశాఖ వర్గాలు వెల్లడించాయి. తిహాడ్‌ జైలు అధికారులకు కూడా ఈ సమాచారాన్ని అందిస్తున్నట్లు తెలిపాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

2. సీఎం జగన్‌తో హైపవర్‌ కమిటీ భేటీ

ముఖ్యమంత్రి జగన్‌తో హైపవర్‌ కమిటీ భేటీ అయింది. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి నివాసంలో ఈ కమిటీ సమావేశమైంది. పాలన వికేంద్రీకరణ, రాజధాని అంశాలపై హైపవర్‌ కమిటీ ముఖ్యమంత్రికి నివేదించింది. వేర్వేరు ప్రతిపాదనలపై సీఎంకు ప్రజెంటేషన్‌ ఇచ్చింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

3. రాజధానిలో 144 సెక్షన్‌పై హైకోర్టు విచారణ

అమరావతి రాజధాని గ్రామాల్లో సెక్షన్‌ 144, పోలీస్‌ యాక్టు 30 అమలుపై హైకోర్టు విచారణ చేపట్టింది. రాజధాని గ్రామాలు, విజయవాడలో నిషేధాజ్ఞలు అమలుపై మొత్తం ఏడు పిటిషన్లు దాఖలయ్యాయి. రాజధాని మహిళలు, రైతులు,  న్యాయవాదులు దాఖలు చేసిన ఈ పిటిషన్లతో పాటు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జీకే మహేశ్వరి ఈ వ్యవహారాన్ని సుమోటోగా విచారణకు స్వీకరించారు. అన్ని పిటిషన్లను కలిపి న్యాయస్థానం విచారణ చేస్తోంది. మరోవైపు, రాజధానిలో ఆందోళనలు 31వ రోజూ కొనసాగుతున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

4. సాంకేతిక లోపం సవరించాం :బొత్స

రాజధాని అంశంపై అమరావతి రైతుల అభిప్రాయాల నమోదులో సాంకేతికలోపం తలెత్తడంతో రైతులు కాసేపు ఇబ్బంద్ది పడ్డారు. సర్వర్‌ డౌన్‌ కారణంగా రైతుల అభిప్రాయాలు నమోదు చేయలేకపోయారు. దీంతో ప్రభుత్వం వెంటనే స్పందించింది. సాంకేతిక లోపాన్ని సవరించింది. సీఆర్‌డీఏ ఈమెయిల్‌, వెబ్‌సైట్‌ పనిచేస్తున్నాయని.. సాంకేతిక లోపాన్ని సవరించినట్లు మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. రైతులు తమ అభిప్రాయాలు, సలహాలు, సూచనలు చేయవచ్చని చెప్పారు. అభ్యంతరాల స్వీకరణకు నేడు తుది గడువు.

5. తెరాస హయాంలో నేరాలు తగ్గాయ్‌: హోంమంత్రి

తెరాస ప్రభుత్వమే అత్యధికంగా కానిస్టేబుల్‌ ఉద్యోగాలను భర్తీ చేసిందని కేంద్ర హోంశాఖ మంత్రి మహమూద్‌ అలీ అన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన అనంతరం పోలీస్‌ శాఖకు మరింత ప్రాధాన్యం కల్పించామన్నారు. శుక్రవారం కానిస్టేబుళ్ల శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంబించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. తెరాస హయాంలో రాష్ట్రంలో నేరమయ ఘటనలు తగ్గాయన్నారు. 267 మంది కానిస్టేబుళ్ల శిక్షణ అభ్యర్థులకు 9 నెలల పాటు కొనసాగనుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

6. నందిగామ వద్ద ట్రాక్టర్‌ బోల్తా: ముగ్గురి మృతి

కృష్ణాజిల్లా నందిగామ వద్ద జొన్నలగడ్డ వద్ద శుక్రవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఉదయం 25మంది కూలీలతో వెళుతున్న ట్రాక్టరు బోల్తాపడింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా.. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. మృతులు పెనుగంచిప్రోలు మండలం గుమ్మడిదల వాసులుగా గుర్తించారు.

7. శిథిలమవుతున్న మాల్యా ఫ్రెంచ్‌ సౌధం

భారత వ్యాపారవేత్త విజయ్‌ మాల్యా ఫ్రాన్స్‌లోని ఓ ద్వీపంలో కొనుగోలు చేసిన విలాసవంతమైన భవనం ఇప్పుడు శిథిలావస్థకు చేరుకుందంట. 17 పడక గదులు, సినిమా థియేటర్‌, హెలిప్యాడ్‌, నైట్‌క్లబ్‌ ఉన్న ఈ సౌధానికి గత కొన్నేళ్లుగా ఎలాంటి మరమ్మతులు చేయించకపోవడంతో చాలా వరకు దెబ్బతిన్నట్లు బ్లూమ్‌బర్గ్‌ పత్రిక ఓ కథనంలో పేర్కొంది. ఫ్రెంచ్‌ ద్వీపమైన ఇలీ సెయింటీ మార్గరైట్‌లో 1.3 హెక్టార్ల విస్తీర్ణంలో ఉన్న ఈ ‘లీ గ్రాండ్‌ జార్డిన్‌’ భవనాన్ని మాల్యా 2008లో కొనుగోలు చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

8. హోబర్ట్‌ ఇంటర్నేషన్‌లో సానియా సంచలనం

భారత టెన్నిస్‌ తార సానియా మీర్జా సంచలనం సృష్టించింది. మహిళల డబుల్స్‌లో తన భాగస్వామి నడియా కిచెనోక్‌ (ఉక్రెయిన్‌)తో కలిసి హోబర్ట్‌ ఇంటర్నేషనల్‌ ఫైనల్‌కు దూసుకెళ్లింది. అమ్మయ్యాక రెండేళ్లు విశ్రాంతి తీసుకున్న ఆమె పునరాగమనంలో అదరగొడుతున్న సంగతి తెలిసిందే. సెమీస్‌ పోరులో ఈ జంట 7-6 (3), 6-2 తేడాతో టమారా జిదన్‌సెక్‌ (స్లొవేకియా), మేరీ బౌజ్‌కోవా (చెక్‌ రిపబ్లిక్‌) జోడీని మట్టికరిపించింది. తుదిపోరులో చైనా ద్వయం, రెండోసీడ్‌ షువై పెంగ్‌, షువై ఝాంగ్‌తో తలపడనుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

9. శ్రీవారి సేవలో ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రబృందం

10. సెన్సేషనల్‌ సాంగ్‌ వచ్చేసింది..!

 

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని