Updated : 17/01/2020 17:25 IST

రేపే ఏపీ కేబినెట్‌ భేటీ

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ మంత్రివర్గ సమావేశం తేదీలో మార్పు జరిగింది. రేపు మధ్యాహ్నం 3 గంటలకు ఈ భేటీ నిర్వహించనున్నట్లు ప్రభుత్వవర్గాలు వెల్లడించాయి. తొలుత ఈనెల 20న మంత్రివర్గ సమావేశం నిర్వహించాలని భావించినప్పటికీ తాజాగా రేపటికే మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు. పరిపాలన వికేంద్రీకరణ, ఏపీ సమగ్రాభివృద్ధిపై జీఎన్‌ రావు, బోస్టన్‌ గ్రూప్‌లు ఇప్పటికే ప్రభుత్వానికి నివేదిక అందజేశారు. ఆ నివేదికలపై పలువురు మంత్రులు, ఐఏఎస్‌ అధికారులతో రాష్ట్ర ప్రభుత్వం హైపవర్‌ కమిటీని ఏర్పాటు చేసింది.

ఆ కమిటీ ఇప్పటికే పలు దఫాలుగా సమావేశమై వివిధ అంశాలపై చర్చించింది. కేబినెట్‌ భేటీకి ముందే ఆ కమిటీ తమ నివేదికను సీఎం జగన్‌కు అందించే అవకాశముంది. కేబినెట్‌ భేటీలో పలు అంశాలతో పాటు హైపవర్‌ కమిటీ నివేదికపైనా చర్చించనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రానికి మూడు రాజధానులు రావొచ్చంటూ గతంలో సీఎం జగన్‌ వ్యాఖ్యానించిన నేపథ్యంలో ఆ అంశంపై కేబినెట్‌ నిర్ణయం తీసుకునే అవకాశముంది. మరోవైపు ఈనెల 20 నుంచి మూడు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. హైపవర్‌ కమిటీ నివేదిక, రాజధానుల అంశంపై అసెంబ్లీలో ప్రభుత్వం ప్రకటన చేసే అవకాశముంది. ఈ నేపథ్యంలో రాజధానులపై ఎలాంటి ప్రకటన చేయనుందనే అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Read latest General News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని