ఏపీలో నిలిచిన ఈ-కేవైసీ సేవలు

ఏపీ రాష్ట్రవ్యాప్తంగా రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల్లో తలెత్తిన సాంకేతిక సమస్య కారణంగా రిజిస్ట్రేషన్ల ప్రక్రియలో ఇబ్బందులు ఎదురయ్యాయి. ఆధార్ వివరాలకు సంబంధించి ఏపీటీఎస్ సంస్థతో రిజిస్ట్రేషన్ల శాఖ చేసుకున్న ఒప్పందం గడువు ఈనెల 12తో ముగిసింది. కొత్తసంస్థతో రిజిస్ట్రేషన్ల శాఖ...

Published : 17 Jan 2020 22:43 IST

రిజిస్ట్రేషన్ల ప్రక్రియలో ప్రజలకు తిప్పలు

అమరావతి: ఏపీ రాష్ట్రవ్యాప్తంగా రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల్లో తలెత్తిన సాంకేతిక సమస్య కారణంగా రిజిస్ట్రేషన్ల ప్రక్రియలో ఇబ్బందులు ఎదురయ్యాయి. ఆధార్ వివరాలకు సంబంధించి ఏపీటీఎస్ సంస్థతో రిజిస్ట్రేషన్ల శాఖ చేసుకున్న ఒప్పందం గడువు ఈనెల 12తో ముగిసింది. కొత్తసంస్థతో రిజిస్ట్రేషన్ల శాఖ ఒప్పందం చేసుకోవాల్సి ఉండగా ఆ ప్రక్రియ జరగలేదు. దీంతో ఈనెల 13వ తేదీ నుంచి రిజిస్ట్రేషన్ల సమయంలో ఆధార్ నంబర్ నమోదు చేయగానే ఈ-కేవైసీ సమస్య తలెత్తుతోంది. సెలవుల నేపథ్యంలో రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు పెద్దగా జనం వెళ్లకపోయేసరికి విషయం వెలుగులోకి రాలేదు. పండుగ ముగియటంతో ఇవాళ రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు వెళ్లిన వారికి సమస్యలు ఎదురయ్యాయి. దీంతో ఎన్‌ఆర్‌ఐలకు మాత్రమే తమ పాస్‌పోర్టు ఆధారంగా రిజిస్ట్రేషన్లు చేసుకునే వెసులుబాటు కల్పించింది. మిగతా వారికి ఇబ్బందులు తప్పలేదు. ఈ-కేవైసీ సమస్యపై రాష్ట్ర వ్యాప్తంగా ఆయా జిల్లాల రిజిస్ట్రార్లు ప్రభుత్వానికి లేఖలు రాసినప్పటికీ సమస్య పరిష్కారానికి నోచుకోలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు