ఏపీ కేబినెట్‌ భేటీ వాయిదా!

ఏపీ కేబినెట్‌ సమావేశం వాయిదా పడింది. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో సీఎం జగన్‌ అధ్యక్షత మంత్రివర్గ భేటీ జరగాల్సింది. తాజాగా సోమవారానికి వాయిదా వేసినట్లు తెలుస్తోంది.

Published : 18 Jan 2020 00:23 IST

అమరావతి: ఏపీ కేబినెట్‌ సమావేశం వాయిదా పడింది. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో సీఎం జగన్‌ అధ్యక్షత మంత్రివర్గ భేటీ జరగాల్సింది. తాజాగా 20వ తేదీ(సోమవారం)కి వాయిదా వేసినట్లు తెలుస్తోంది. తొలుత ఈనెల 20న మంత్రివర్గ సమావేశం నిర్వహించాలని ప్రభుత్వ భావించినప్పటికీ.. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు నిర్వహించనున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.  తాజాగా ఈ రోజు జరగాల్సిన భేటీ  కూడా వాయిదా పడింది. ఈనెల 20 నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభానికి ముందే కేబినెట్‌ భేటీ నిర్వహించి పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపే అవకాశముంది. కేబినెట్‌ భేటీకి ముందే హైపవర్‌ కమిటీ కూడా తమ నివేదికను సీఎం జగన్‌కు అందజేసే అవకాశముంది.ఆ నివేదికపైనా కేబినెట్‌లో చర్చించనున్నారు. మూడు రాజధానుల అంశంపై రాష్ట్రంలో చర్చ జరగుతున్న నేపథ్యంలో కేబినెట్‌లో నిర్ణయం తీసుకుని అసెంబ్లీ సమావేశాల్లో దానిపై స్పష్టత ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని