డెంగీకి మింగుడు పడని దోమలు!

ప్రాణాంతక డెంగీ వైరస్‌ వ్యాప్తికి అడ్డుకట్ట వేయగల సరికొత్త రకం దోమలను పరిశోధకులు తాజాగా సృష్టించారు. మానవ యాంటీబాడీలతో కూడిన ఈ దోమలు జన్యు ఇంజినీరింగ్‌ విధానంలో తొలిసారిగా రూపుదిద్దుకున్నాయి. సాధారణంగా ఆడ ఏడిస్‌ ఏజిప్టి దోమల ద్వారా డెంగీ వైరస్‌ వ్యాప్తి చెందుతుంది. మానవుల నుంచి సేకరించిన ‘కార్గో’ యాంటీబాడీని దోమల్లోకి పరిశోధకులు చొప్పించారు.

Published : 17 Jan 2020 23:53 IST

 జన్యు ఇంజినీరింగ్‌ విధానంలో సృష్టించిన పరిశోధకులు 

వాషింగ్టన్‌: ప్రాణాంతక డెంగీ వైరస్‌ వ్యాప్తికి అడ్డుకట్ట వేయగల సరికొత్త రకం దోమలను పరిశోధకులు తాజాగా సృష్టించారు. మానవ యాంటీబాడీలతో కూడిన ఈ దోమలు జన్యు ఇంజినీరింగ్‌ విధానంలో తొలిసారిగా రూపుదిద్దుకున్నాయి. సాధారణంగా ఆడ ఏడిస్‌ ఏజిప్టి దోమల ద్వారా డెంగీ వైరస్‌ వ్యాప్తి చెందుతుంది. మానవుల నుంచి సేకరించిన ‘కార్గో’ యాంటీబాడీని దోమల్లోకి పరిశోధకులు చొప్పించారు. వాటి శరీరంలో అది క్రియాశీలమై.. డెంగీ వైరస్‌లు వృద్ధి చెందకుండా అడ్డుకట్ట వేస్తున్నట్లు పరిశోధకులు గుర్తించారు. ఫలితంగా వాటి వ్యాప్తికి అడ్డుకట్ట పడుతోందని తేల్చారు. మొత్తం 4 రకాల డెంగీ వైరస్‌లకు ముకుతాడు వేయడంలో కార్గో విజయవంతమవుతున్నట్లు తెలిపారు. దోమల ద్వారా వ్యాప్తి చెందే ఇతర వైరస్‌లను కూడా అడ్డుకునే దిశగా తమ ఆవిష్కరణ కీలక ముందడుగవుతుందని పేర్కొన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని