పులుల పోరాటం.. వైరల్ వీడియో
కొంతమంది పర్యాటకులకు రెండు పులుల్నే కాకుండా, వాటి మధ్య పోరాటాన్ని కూడా లైవ్‌లో చూసే అవకాశం దక్కంది.
ఇంటర్నెట్ డెస్క్: జూలలో తప్ప పులిని బయట చూడగలగటం చాలా అరుదు. ఒకవేళ సఫారీకి వెళ్లినా పులి కనపడుతుందనే నమ్మకం లేదు. కానీ కొంతమంది పర్యాటకులకు రెండు పులుల్నే కాకుండా, వాటి మధ్య పోరాటాన్ని కూడా లైవ్‌లో చూసే అవకాశం దక్కంది. ఇది రెండు ఎదిగిన పులుల మధ్య ఆ ప్రాంతంపై ఆధిపత్యం కోసం జరిగిన పోరాటం అని ఆ వీడియోను షేర్ చేసిన అటవీ అధికారి వివరించారు. భారతీయ అడవుల్లో మార్మోగే పులిగర్జనలను ఈ వీడియోలో మీరు స్పష్టంగా వినవచ్చని కూడా ఆయన పేర్కొన్నారు.
ఒక జీపులో నుంచి తీసిన ఈ వీడియోలో భారీ ఆకారం గల రెండు పులులు ఒక దానిపై ఒకటి అరుచుకుంటున్నాయి. కొన్ని క్షణాల తరువాత వాటిలో ఒకటి రెండవ దానిపై దూకింది. దానితో వాటి మధ్య సమరం మొదలయింది. సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోలో అ భీకర పోరాటాన్ని మనం కూడా చూడవచ్చు. ఒళ్లు గగుర్పొడిచే వాటి గర్జనలను వినవచ్చు. కేవలం నాలుగు రోజుల్లో లక్షమంది చూసిన ఈ వీడియో మీరూ చూడండి మరి...
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
తిరుమల నడక మార్గంలో చిరుత సంచారం
అలిపిరి కాలిబాటలో చిరుత సంచారం కలకలం సృష్టించింది. ఈ నెల 25, 26 తేదీల్లో ఇక్కడి నడక మార్గంలో చిరుత కదలికలు కనిపించాయి. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (28/03/2024)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు..
తాజా వార్తలు (Latest News)
-
ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులను నియమించిన కేంద్ర ఎన్నికల సంఘం
-
‘ఎంపీగా లేకపోతేనేం’.. వరుణ్ గాంధీ భావోద్వేగ లేఖ
-
జగన్.. ఈ 7 ప్రశ్నలకు సమాధానం చెప్పగలరా?: చంద్రబాబు సవాల్
-
సూచీల దూకుడు.. 900+ పాయింట్ల లాభంలో సెన్సెక్స్.. కారణమేంటి?
-
వరుస ఫ్లాప్స్ వల్లే రాజకీయాల్లోకి అడుగుపెట్టారా: కంగన సమాధానం ఏమిటంటే..?
-
రషీద్ బౌలింగ్‌లో సిక్స్‌లు.. ధోనీ సలహాలు పాటించా: సమీర్ రిజ్వీ