ఆ చిన్నారుల వయసు 100ఏళ్ల పైనే..!

బరేలి: ఉత్తర్‌ప్రదేశ్‌లోని రాయ్‌బరేలికి చెందిన ఇద్దరు చిన్నారుల వయసు 102, 104 సంవత్సరాలు. అదేంటి చిన్నారులంటూనే.. వృద్ధుల వయసు చెబుతున్నారేంటి అని అనుకుంటున్నారా? లంచం ఇవ్వనందుకు గాను అక్కడి అధికారులు చేసిన నిర్వాకం ఇది. 

Published : 22 Jan 2020 01:43 IST

బరేలి: ఉత్తర్‌ప్రదేశ్‌లోని రాయ్‌బరేలికి చెందిన ఇద్దరు చిన్నారుల వయసు 102, 104 సంవత్సరాలు. అదేంటి చిన్నారులంటూనే.. వృద్ధుల వయసు చెబుతున్నారేంటి అని అనుకుంటున్నారా? లంచం ఇవ్వనందుకు గాను అక్కడి అధికారులు చేసిన నిర్వాకం ఇది. 

బరేలి ప్రాంతంలోని బేలా గ్రామానికి చెందిన పవర్‌ కుమార్‌కు ఇద్దరు రెండు సంవత్సరాల మేనల్లుడు సంకేత్‌, మరో మేనల్లుడు సుభ్‌(4) ఉన్నారు. వారిద్దరికీ జనన ధ్రువీకరణ పత్రం కోసం దరఖాస్తు చేసుకున్నాడు. కానీ అక్కడి విలేజ్‌ డెవలప్‌మెంట్‌ అధికారి సుశీల్‌ చంద్‌ అగ్నిహోత్రి, ప్రవీన్‌ మిశ్రా జనన ధ్రువీకరణ పత్రాలు కావాలంటే లంచం ఇవ్వాల్సిందిగా డిమాండ్‌ చేశారు. ఒక్కొక్కరికి రూ.500 చొప్పున లంచం ఇవ్వమని పవన్‌ను అడిగారు. అందుకు అతడు నిరాకరించాడు. దీంతో సదరు అధికారులు ఇద్దరు చిన్నారుల పుట్టినతేదీలను మార్చేసి ధ్రువీకరణ పత్రాలను మంజూరు చేశారు. సంకేత్‌ జనవరి 6,2018లో పుట్టగా అతడికి జూన్‌ 13, 1916లో పుట్టినట్లుగా ధ్రువపత్రంలో రాశారు. ఇక సుభ్‌ 2016, జూన్‌ 13న జన్మించగా జనవరి 6, 1918లో పుట్టినట్టు రాశారు. వాటిని చూసి పవన్‌ షాక్‌ అయ్యాడు. ఆగ్రహించిన అతడు బరేలి న్యాయస్థానంలో పిటిషన్‌ వేశాడు. పరిశీలించిన కోర్టు పోలీసులను కేసు నమోదు చేసి వారిపై తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని