గవర్నర్‌కు తెదేపా శాసనసభాపక్షం లేఖ

గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌కు తెదేపా శాసన సభాపక్షం లేఖ రాసింది. రాజ్యాంగాన్ని పరిరక్షించేందుకు జోక్యం చేసుకోవాలని లేఖల్లో ఆయన్ను కోరింది. శాసనసభలో..

Updated : 22 Jan 2020 16:10 IST

అమరావతి: గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌కు తెదేపా శాసన సభాపక్షం లేఖ రాసింది. రాజ్యాంగాన్ని పరిరక్షించేందుకు జోక్యం చేసుకోవాలని లేఖలో ఆయన్ను కోరింది. శాసనసభలో ప్రతిపక్ష సభ్యులపై దాడులు చేయండంటూ మంత్రులు, ఎమ్మెల్యేలను సీఎం ప్రోత్సహిస్తుంటే సభాపతి ప్రేక్షకపాత్ర పోషిస్తున్నారని పేర్కొంది. రాష్ట్ర ప్రజల మనోభావాలను పరిగణనలోకి తీసుకుని దానికి అనుగుణంగా జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేసింది. 
‘‘అసెంబ్లీని ప్రజాస్వామ్య పద్ధతిలో నిర్వహించేలా వెంటనే తక్షణ చర్యలు చేపట్టాలి. శాసన సభాపతి, అధికార పార్టీ సభ్యుల ప్రవర్తన సభలో సరిగాలేదు. అప్రజాస్వామిక విధానాలతో శాసనసభ నడుస్తోంది. సీఎంతో పాటు మంత్రులు నిబంధనలను పక్కనపెట్టి అధికార పార్టీకి అనుగుణంగా సభను నిర్వహిస్తున్నారు. సభాపతి సైతం మమ్మల్ని భయభ్రాంతులకు గురిచేసే విధంగా వ్యవహరిస్తున్నారు. ప్రతిపక్ష సభ్యులపై వివక్ష చూపుతూ సొంత పార్టీ సభ్యులకు అనుకూలంగా ఆయన వ్యవహారశైలి ఉంటోంది’’ అని గవర్నర్‌కు రాసిన లేఖలో తెదేపా ఎమ్మెల్యేలు పేర్కొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు