డ్యాన్స్‌తో అదరగొట్టిన స్పైడర్‌మ్యాన్‌

స్పైడర్‌మ్యాన్‌ చక్కని మూమెంట్లతో దేశీ భాంగ్రా డాన్స్‌ను అదరగొట్టాడు.

Updated : 24 Jan 2020 23:56 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: పిల్లల్ని మీకు నచ్చిన కార్టూన్‌ పాత్రల పేర్లు చెప్పమంటే వాటిలో తప్పనిసరిగా స్పైడర్‌మ్యాన్‌ ఉండే తీరతాడు. ఇక మిక్కీ మౌస్‌, మిన్నీమౌస్‌ అయితే పిల్లల్నే కాదు పెద్దల్నీ ఆకర్షిస్తాయి. అందుకేనేమో ఫేస్‌బుక్‌లో షేర్‌ చేసిన ఈ టిక్‌టాక్‌ వీడియో అందర్నీ ఆకట్టుకుంటోంది. దీనిలో స్పైడర్‌మ్యాన్‌ చక్కని మూమెంట్లు చేస్తూ దేశీ భాంగ్రా డాన్స్‌తో అదరగొట్టాడు. అతనితో పాటు కాలు కదిపిన కార్టూన్‌ పాత్రలు మిక్కీ‌, మిన్నీలను కూడా ఈ వీడియోలో చూడచ్చు. మీరూ స్పైడర్‌ మ్యాన్‌ అభిమానులా? అయితే ఈ వీడియో చూసేయండి మరి!

 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని