పార్టీ రంగులు తొలగించాల్సిందే: హైకోర్టు

పంచాయతీ కార్యాలయాలు ప్రభుత్వానివని, వాటికి పార్టీ రంగులు ఉండకూదని ఏపీ హైకోర్టు ధర్మాసనం పేర్కొంది. పంచాయతీ ఎన్నికలు వస్తున్నందున వైకాపా రంగులను తొలగించాలని హైకోర్టు ఆదేశించింది.

Updated : 27 Jan 2020 19:15 IST

అమరావతి: పంచాయతీ కార్యాలయాలు ప్రభుత్వానివని, వాటికి పార్టీ రంగులు ఉండకూదని ఏపీ హైకోర్టు ధర్మాసనం పేర్కొంది. పంచాయతీ ఎన్నికలు వస్తున్నందున వైకాపా రంగులను తొలగించాలని హైకోర్టు ఆదేశించింది. పంచాయతీ కార్యాలయాలకు వైకాపా రంగు వేయడాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై విచారణ సందర్భంగా హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. గుంటూరు జిల్లాలో పంచాయతీ కార్యాలయానికి వైకాపా రంగు వేశారంటూ శ్రీనివాస్‌ అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పంచాయతీ కార్యాలయాలు ప్రభుత్వానికి చెందినవని, ప్రభుత్వ ఆస్తులపై ఎలాంటి పార్టీ రంగులూ ఉండకూడదని ఈ పిటిషన్‌పై విచారణ సందర్భంగా ధర్మాసనం అభిప్రాయపడింది. ఈ వ్యవహారంలో రాష్ట్ర ఎన్నికల సంఘం బాధ్యత తీసుకోవాలని, కౌంటర్‌ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను వచ్చే నెల 5కి వాయిదా వేసింది.

 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని