‘మండలి రద్దుపై ఏడాదిలోపు చర్చ కష్టం’

మండలి రద్దు ఒక్క రోజులో తేలే వ్యవహారం కాదని అసెంబ్లీ మాజీ న్యాయ సలహాదారు జంధ్యాల రవిశంకర్‌ అన్నారు. మండలిపై కేంద్రం వద్ద ఇప్పటికే అనేక తీర్మానాలు ఉన్నాయని చెప్పారు. ఏపీ శాసన సభలో మండలి .....

Published : 28 Jan 2020 01:37 IST

అసెంబ్లీ మాజీ న్యాయ సలహాదారు రవిశంకర్‌

హైదరాబాద్‌: మండలి రద్దు ఒక్క రోజులో తేలే వ్యవహారం కాదని అసెంబ్లీ మాజీ న్యాయ సలహాదారు జంధ్యాల రవిశంకర్‌ అన్నారు. మండలిపై కేంద్రం వద్ద ఇప్పటికే అనేక తీర్మానాలు ఉన్నాయని చెప్పారు. ఏపీ శాసన సభలో మండలి రద్దుపై తీర్మానం చేసిన నేపథ్యంలో ఈనాడు-ఈటీవీతో ఆయన మాట్లాడారు. శాసన మండలి రద్దుపై తీర్మానం చేసినంత మాత్రాన ఇప్పటికిప్పుడు వచ్చే ఇబ్బంది ఏమీ లేదన్నారు. రాష్ట్రపతి ఉత్తర్వులు వచ్చే వరకు మండలి కొనసాగుతుందని చెప్పారు. 2013 తర్వాత 2019లోపు ఇలాంటివి ఐదు బిల్లులు కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉన్నాయన్నారు. 1970లో యూపీలో చేసిన మండలి రద్దు తీర్మానం 1980 నాటికి కూడా కేంద్రం ఆమోదం పొందలేదని.. చివరికి మండలి కొనసాగాల్సి వచ్చిందని చెప్పారు. తాజాగా ఏపీ శాసనసభ చేసిన తీర్మానంపై ఏడాదిలోపు చర్చ కూడా జరిగే అవకాశం లేదన్నారు.

రాష్ట్రపతి నుంచి గెజిట్‌ విడుదలైన తర్వాతే పూర్తిస్థాయిలో మండలి రద్దవుతుందని చెప్పారు. మండలి ఛైర్మన్‌ సెలెక్ట్‌ కమిటీకి బిల్లును పంపడమంటే ప్రజాభిప్రాయసేకరణకు వెళ్లడమేనని రవిశంకర్‌ వివరించారు. మరోవైపు బిల్లులు సెలెక్ట్‌ కమిటీ వద్ద పెండింగ్‌లో ఉన్నాయని ఇప్పటికే హైకోర్టుకు తెలిపిన నేపథ్యంలో తాజాగా రద్దు తీర్మానంపై ప్రభుత్వం న్యాయస్థానంలో ఏం సమాధానం చెబుతుందో చూడాలన్నారు. వచ్చే బడ్జెట్‌ సమావేశాల్లోనూ శాసనసభలాగే మండలి కూడా యథావిధిగా సమావేశం కావాల్సి ఉంటుంది. సెలెక్ట్‌ కమిటీకి పేర్లు ఇవ్వకపోతే ఛైర్మన్‌ స్వయంగా కొందరిని నియమించుకునే అధికారం ఉందన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని