అపర జ్ఞాని.. ఈ చిన్నారి

కర్ణాటకకు చెందిన ఓ బాలిక ఏడేళ్లకే డాక్టరేట్‌ అందుకుంది. బళ్లారి జిల్లా బొమ్మనహళ్లికి చెందిన నాగరాజ్‌, భారతీల కుమార్తె వైధ్రుతి నాగరాజ్‌ కోరిశెట్టర్‌ బాల మేధావిగా అందరి మన్ననలు పొందుతుంది. గఢఘ్‌ జిల్లా నారగుండలో ప్రస్తుతం రెండో తరగతి చదువుతున్న

Published : 28 Jan 2020 01:37 IST

బెంగళూరు: కర్ణాటకకు చెందిన ఓ బాలిక ఏడేళ్లకే డాక్టరేట్‌ అందుకుంది. బళ్లారి జిల్లా బొమ్మనహళ్లికి చెందిన నాగరాజ్‌, భారతీల కుమార్తె వైధ్రుతి నాగరాజ్‌ కోరిశెట్టర్‌ బాల మేధావిగా అందరి మన్ననలు పొందుతోంది. గఢఘ్‌ జిల్లా నారగుండలో ప్రస్తుతం రెండో తరగతి చదువుతున్న ఈ చిన్నారి.. రెండేళ్ల నుంచే జనరల్ నాలెడ్జ్‌ను ఒంటపట్టించుకుంది. జాతీయ, అంతర్జాతీయ రాజకీయాలు, ఆర్థిక అంశాలు, చరిత్ర విశేషాలు, కవులు, నదులు, రాజులు, సామ్రాజ్యాలు ఇలా వేటి గురించి అడిగినా టకటకా సమాధానం చెప్పేంతగా రాటుదేలింది. చిన్న వయస్సులోనే వందలాది అవార్డులు సైతం సొంతం చేసుకుంది. చిన్నారి అద్భుత జ్ఞాపకశక్తికి గాను మధురై విశ్వవిద్యాలయం ఆమెను డాక్టరేట్‌తో సత్కరించింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని